వడదెబ్బ పై అవగాహన
తిరుమలగిరి 17 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్ :- ప్రాధమిక ఆరోగ్య కేంద్రం తిరుమలగిరి ఆధ్వర్యంలో వడదెబ్బ గురించి చింతల కుంట తండా, మర్రి కుంట తండా గ్రామ పంచాయతీ పరిదిలో ఉపాధి హామీ కార్మికులకు మరియు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్మికులకు వడదెబ్బ లక్షణాలు, జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం గురించి డాక్టర్ మల్లెల వందన అవగాహన కల్పించారు. ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 4 గంటల తరువాత పనికి వెళ్ళాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలు చెమట పట్టక పోవడం, శరీర ఉషోగ్రత పెరగడం, వణకు పుట్టడం,మగతగా ఉండడం, పిట్ రావడం, పాక్షికంగా అప్ష్మరక లోకి వెళ్ళడం జరుగుతుంది అని వివరించడం జరిగింది.
తరుచుగా మంచినీళ్ల త్రాగడం, మజ్జిగ, నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు, పల్ల రసాలు తీసుకోవాలి సూచించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో బయటికీ వెళితే, కాళ్ళకు చెప్పులు ధరించడం,టోపి,గొడుగు,తేలిక పాటి తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. రోడ్ల పై దొరికే పానీయాలు తీసుకోకూడదని కోరారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు,పోస్ట్ ఆఫీస్, ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని అత్యవసర పరిస్థితుల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం యందు వైద్య సేవలు వినియోగించు కావాలని తెలిపారు.ఆర్స్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాం దుర్గ రెడ్డి,CHO మాలోతు బిచ్చు నాయక్, కమిషన్ శ్రీధర్, సూపర్ వైజర్ స్వరూప కుమారి, MLHP లు, డాక్టర్ మణికంఠ రాజ్, డాక్టర్ మచ్చ శిరీష, నరసింహా రెడ్డి, విజయ్ శ్రీలత, వెంకటమ్మ, రజిత, ఖదీర్, మహేశ్వరి, తరమ్మ,కమల,పాల్గొన్నారు.