రాజస్థాన్ మొబైల్ షాప్స్ ఆగడాలనీ అరికట్టాలి..

రాజస్థాన్ మొబైల్ షాప్స్ ఆగడాలను అరికట్టాలి
తెలంగాణ వార్త 22.09.2024.సూర్యపేట జిల్లా ప్రతినిధి. అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న నిర్వాహకులు మొబైల్ షాప్ నిర్వాహకులను కొడుతామంటూ బెదిరిస్తున్న వైనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజస్థాన్ మొబైల్ షాప్స్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మణికంఠ మొబైల్ షాప్ నిర్వాహకుడు పవన్ ఆరోపించారు. ఆదివారం రాత్రి ఆయన దుకాణం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ రామ్ చందర్ నాయక్ హాస్పటల్ పక్క సందులో మణికంఠ మొబైల్ షాప్ ను తాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన దుకాణం పక్కనే రాజస్థాన్ కు చెందిన అంబి మొబైల్స్ షాప్ రాజస్థాన్ కు చెందిన కైలాష్,సతీష్ లు నిర్వహిస్తున్నారు. యూనియన్ నిబంధనల ప్రకారం హోల్ సేల్ దుకాణాలలో సర్వీస్ చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ దానిని అతిక్రమించి సతీష్, కైలాస్ లో తమ దుకాణంలో సర్వీస్ ను ఇస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన తనపై దాడికి దిగారని మేము అలానే చేస్తాము ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.
ఈ విషయమై తాను పోలీస్ స్టేషన్ తో పాటు యూనియన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పోలీసులు యూనియన్ నిర్వాహకులు ఈ విషయమే స్పందించి తనకు న్యాయం చేయాల్సిందిగా రాజస్థాన్ మొబైల్ దుకాణాల ఆగడాలను అరికట్టి స్థానిక మొబైల్ దుకాణ నిర్వాహకులకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.