ఐటీ హబ్ ఇండస్ట్రియల్ పార్కులు పునరుద్ధరించాలి...

Sep 22, 2024 - 22:58
Sep 23, 2024 - 08:25
 0  36

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు

 తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్

(సూర్యాపేట టౌన్ సెప్టెంబర్ 22 )  సూర్యాపేటలో ఐటి హబ్ ఇండస్ట్రియల్ పార్కులు పునరుద్ధరించాలి   సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ *అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఐటీ హబ్ ఇండస్ట్రియల్ పార్కులు తిరిగి పునరుద్ధరించాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులు సహకరించాలని ఆయన అన్నారు. ఐటీ హాబ్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం పాత కలెక్టరేట్ కార్యాలయంలో ఐటి హబ్ ను ఎన్నికలకు ముందు లాంచనంగా ప్రారంభించింది ఎన్నికలలో ప్రభుత్వం మారడంతో నూతన ప్రభుత్వానికి ప్రాధమ్యాలు మారిపోవడంతో ఐటి హబ్ పూర్తిగా గాలికి వదిలేసినట్లయింది. నిజానికి ఐటీ హబ్ ఏర్పాటు చేయడానికి రెండేళ్ల కృషి ఉంది అందులో యూఎస్ లో ఉన్న అనేక కంపెనీలను సూర్యాపేటలో పెట్టడానికి ఒప్పించడం వాటిలో దాదాపు దాదాపు10 కంపెనీలు ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం అంగీకరించడం తో ఐటీ హబ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సెంటీఫోర్స్ సంస్థ నిర్వాహకులు రజనీకాంతు సంఘాని ఐటీ హబ్ కోసం తీవ్రంగా ప్రయత్నించి ఓ మేరకు విజయం సూర్యాపేట సమీపంలో ఉన్న బాల్యంలో గ్రామానికి చెందిన రజనీకాంత్ సూర్యాపేటకు తన వంతుగా ఏదైనా ఒక నిర్మాణాత్మక కార్యక్రమంనీ సాధించాలని ఐటి హబ్ ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో విస్మయానికి గురి అయ్యారు ఇటీవల అమెరికా టూర్ లో రజనీకాంత్ సూర్యాపేటలో ఐటి హబ్ తిరిగి ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా విన్నవించుకున్నాడు. తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కావున దాన్ని తిరిగి పునర్ ప్రారంభించాలని సూర్యాపేట జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. త్వరలో ఆ కోరిక నెరవేరాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కోసంపెట్టడం పెట్టుబడి పెట్టడానికికలెక్టరేధరణి వెబ్సైట్లో పాత డిజిటల్ యాప్ ను తీసేశారు. అలా తీయడం వల్ల సర్టిఫై కాపీలు ఆన్లైన్లో రావట్లేదు. అవి బ్యాంకు లోన్  గాని వ్యక్తిగత పనులకు గాని అవసరం ఉంటది. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.  పది వేలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు.  మున్సిపల్ కార్యాలయం ద్వారా గతంలో ఇంటి నెంబర్ ఇచ్చి అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు కాక యజమానులు ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. అన్నారు. అధికారులు స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక వస్తువులు లేక నిత్యం కార్యాలయం పనుల మీద వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు. జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం కోసం కృష్ణానగర్లో గతంలోనే 8 గుంటల స్థలాన్ని గుర్తించారని ,భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి అన్ని మౌలిక వస్తువులు కల్పించి నిర్మాణం చేపట్టాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్ పట్టణ గౌరవ సలదారుడు మండాది గోపాల్ రెడ్డి   వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333