తెలంగాణను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

తెలంగాణను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి.
తెలంగాణవార్త 22.09.2024 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాదులోని ది ప్లాజా హోటల్ నుండి అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రమైన నాగార్జునసాగర్ హిల్ కాలనీ వరకు 200 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రారంభించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక ఎండి ప్రకాష్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.