కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు

Mar 9, 2025 - 19:57
 0  38
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బిక్కీ బుచ్చయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన మండల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌడ్లు వృత్తి ప్రమాదాల బారిన పడకుండా అందరికీ సేఫ్టీ మోకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్యాంకుబండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి గౌడ వ్యక్తికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ,వృత్తి నిర్వహిస్తున్న వారికి లైసెన్స్ ఇవ్వాలని అన్నారు. గౌడులు రాజకీయాలకతీతంగా ఐక్యమై తమ హక్కులు సాధించుకోవాలని అన్నారు. నీరా కేంద్రాన్ని ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తే గౌడులు చూస్తూ ఊరుకోరని ,ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేంద్రాలు ఏర్పాటు చేసి గౌడ్ లు ఆర్దికంగా బలపడేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దంతూరి సోమన్న, జిల్లా ఉపాధ్యక్షులు జలగం మల్లేష్, మండల అధ్యక్షుడు గుణగంటి బిక్షం, నాయకులు కసగాని బ్రహ్మం గౌడ్ ,గిలకత్తుల సోమయ్య,కట్ల కరుణాకర్ బట్టిపల్లి వెంకన్న , అబ్బ గాని లక్ష్మయ్య, గుణగంటి శ్రీను వెంకన్న గుండ్ల లింగయ్య, గిలకత్తుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.