రాఖీ పౌర్ణమి విశిష్టత, దేవతల నుండి మొదలైన రాఖీ చరిత్ర ఇదే!

Aug 18, 2024 - 23:35
Aug 21, 2024 - 21:05
 0  1
రాఖీ పౌర్ణమి విశిష్టత, దేవతల నుండి మొదలైన రాఖీ చరిత్ర ఇదే!

రాఖీ పౌర్ణమి రేపే.. రక్షాబంధన్, రాఖీగా పిలవబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకుంటారు. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష అన్న సంకేతాన్ని చాటి చెప్పేలా రాఖీ పండుగ ప్రతీ ఏడాది శ్రావణ పౌర్ణమి నాడు ఘనంగా జరుపుకుంటారు.


రాఖీ పౌర్ణమి చారిత్రక నేపధ్యం, విశిష్టత తెలుసా

సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ అయిన రాఖీ పండుగ ఈ సంవత్సరం ఆగస్ట్ 19 వ తేదీన వస్తుంది. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు , అక్కాతమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ విశిష్టత, చారిత్రక నేపధ్యం ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.


రాఖీ పండుగ సోదరీ సోదరుల ప్రేమకు ప్రతీక

ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే జరుపుకునే ఈ పండుగ. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు జరుపుకుంటున్నారు. చిన్నా పెద్దా, పేద ధనిక తేడాలు లేకుండా అందరూ రాఖీని జరుపుకుంటారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని రాఖీ ద్వారా తెలియజేస్తారు.


రాఖీ పురాణ కథలు 

ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను జరుపుకోవటం వెనుక ఎన్నో పురాణ కథలు, చారిత్రక నేపధ్యం ఉంది. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సాగిన భీకర యుద్ధం దాదాపు పుష్కర కాలం పాటు సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు రాజు దేవేంద్రుడు, అమరావతిలో తలదాచుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించటానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది.

దేవేంద్రుడికి రాఖీ కట్టటంతో మొదలైన సాంప్రదాయం

అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి ఇంద్రాణి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది . ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా రక్షాబంధనం మొదలు కాగా, అప్పటినుండి ఇప్పటివరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ అయ్యింది.   

                                                                                                                                      నా సోదరి సోదరీమణులకు తొండ గ్రామ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 

మీ. .. *జేరిపోతుల రాoకుమార్ (JRK) 

తెలంగాణవార్త రిపోర్టర్ తిరుమలగిరి మండలం

మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి సెల్ నెంబర్ 7674 0070 34

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333