నాయకుడిని కాదు… సేవకుడిని ఇండిపెండెంట్ అభ్యర్థి వల్దాసు రాజీవ్

Feb 8, 2026 - 21:14
Feb 8, 2026 - 21:16
 0  62
నాయకుడిని కాదు… సేవకుడిని ఇండిపెండెంట్ అభ్యర్థి వల్దాసు రాజీవ్

సొంత పానిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చిన 16వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి వల్దాసు రాజీవ్ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మనవి 

సూర్యాపేట: నాయకుడిగా కాదు, సేవకుడిగా మీ ముందుకు వచ్చాను. ఒక్కసారి అవకాశం ఇస్తే, మళ్లీ మీరే అవకాశం ఇచ్చేలా పని చేసి చూపిస్తా” అని వల్దాసు ఏడుకొండలు తనయుడు, 16 వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి వల్దాసు రాజీవ్ స్పష్టం చేశారు. సొంత పానిఫెస్టోతో గెలుపు దిశగా అడుగులు వేస్తున్న ఆయన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తన కార్యాచరణను వివరించారు.

ఎన్నికైన ఒక సంవత్సరం లోపే అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేసి, కొత్త రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజల భద్రత దృష్ట్యా జంక్షన్లు, మెయిన్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

వార్డు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా

పబ్లిక్ పార్క్, పిల్లల ఆటస్థలం, ఓపెన్ జిమ్ సెంటర్ ఏర్పాటు,

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక కార్యాలయం,

అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి,

కొత్త మురికి కాల్వల ఏర్పాటు, కల్వర్టులపై రక్షణ గోడలు,

గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత రవాణా,

రోజూ చెత్త ట్రాక్టర్, పారిశుధ్య కార్మికులు వచ్చేలా పర్యవేక్షణ,

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే యువతకు మినీ స్టడీ హాల్,

వార్డులో ఎవరు మరణించినా అంత్యక్రియలకు స్వయంగా రూ.10,000 ఆర్థిక సహాయం,

మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక ప్రోత్సాహం,

మహిళల కోసం కుట్టు మిషిన్ సెంటర్ ఏర్పాటు

చేస్తామని వెల్లడించారు.

ఇప్పటి వరకు చాలా మందికి అవకాశం ఇచ్చినా, అభివృద్ధి మాత్రం నామమాత్రంగానే జరిగిందని విమర్శించారు. “మీ ఓటు మీకోసమే కాదు… మన 16 వ వార్డు ప్రజలందరి భవిష్యత్తు కోసం. నేను ఇక్కడే పుట్టాను, మీ మధ్యనే పెరిగాను. అన్ని వేళల మీకు అందుబాటులో ఉంటాను” అంటూ మాట ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏడుకొండలు సైదులు, నవీన్, విజయ, కల్పన, మహేశ్వరి, వెంకటేష్, సుశీలమ్మ, రాహుల్, లింగయ్య, సోమక్క, రంజిత్, అరుణ, సూర్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333