ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్

Feb 11, 2026 - 15:21
Feb 11, 2026 - 15:22
 0  10
ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తన ఓటు హక్కున వినియోగించుకున్నారు. బుధవారం స్థానిక కృష్ణానగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన వార్డు నంబర్ 14, పోలింగ్ స్టేషన్ నంబర్ 49 వద్ద ఓటు వేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని నిర్భయంగా ఓటు వేయాలని, స్థానిక స్వపరిపాలనలో భాగస్వాములు కావాలని సూచించారు.

 ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333