అలంపూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రహ్మరథం పట్టిన కరుడుగట్టిన కాంగ్రెస్ సైనికులు

Feb 6, 2026 - 17:18
 0  40

 జోగులాంబ గద్వాల 6ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : .అలంపూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈరోజు ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ .ఏ. సంపత్ కుమార్ ఎన్నికలో బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సంపత్ కుమార్  మాట్లాడుతూ...!

అలంపూర్ మున్సిపాలిటీ లో ప్రధాన సమస్య నివాస స్థలాలు (ప్లాట్ల) సమస్య మరియు దేవాలయాన్ని ఆనుకుని ఉన్న ఇండ్లు ఈ రెండు సమస్యలకు పరిష్కారం చేయడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చానని అన్నారు...

గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఇండ్లు రేషన్ కార్డులు జాబులు ఇవ్వలేదు కనుకనే గద్దెదిగిందని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు, ఉచిత కరెంటు బిల్లులు వస్తున్నాయని కనుక ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అన్నారు. 

టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడంతో పాటు ఈ నియోజకవర్గాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ కుటుంబ పాలన లో తెలంగాణను నాశనం చేశారని ప్రజల బతుకుని ఆగం చేశారని సంపత్ కుమార్ కుమార్ మండిపడ్డారు.

మార్చి 31 తర్వాత ఇంకా తదితర అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రారంభించ బోతున్నారని పేదల ప్రభుత్వం ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకుపోతా ఉంది అని అన్నారు.

అధికారంలో పైన కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక ఏ అభివృద్ధిపై జరగాలన్న పైన రేవంత్ రెడ్డి  సంతకం పెడితేనే జరుగుతుంది కనుక మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఆభ్యర్థులు మీ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మీ మీ సమస్యలను తీసుకెళ్లి వాటి పరిష్కార దిశగా కృషి చేస్తారని అన్నారు. 

చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అలంపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కైవసం కాగానే అభివృద్ధికి శ్రీకారం చుడతానని అలంపూర్ మున్సిపాలిటీలో ప్లాట్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారందరికీ సమస్యను తీర్చి వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని సంపత్ కుమార్  తెలిపారు. 


టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల లోనే అలంపూర్ మున్సిపాలిటీకి 125 ఇళ్ళను ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి నాయకత్వం లోనే సాధ్యమైందని మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి చైర్మన్ పీఠంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టినట్లయితే ఇంకా 150 పైగానే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని సంపత్ కుమార్ అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333