అవకాశం ఇవ్వండి – అభివృద్ధి చేసి చూపిస్తా
33వ వార్డు ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి మీల వంశీ
సూర్యాపేట:
33వ వార్డు అభివృద్ధే ధ్యేయంగా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మీల వంశీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం ప్రజల విస్తృత ఆదరణతో జోరుగా కొనసాగుతోంది. “అవకాశం ఇవ్వండి – అభివృద్ధి చేసి చూపిస్తా” అనే నినాదంతో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ వార్డు ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తున్నారు.
ఈ సందర్భంగా మీల వంశీ మాట్లాడుతూ గత కౌన్సిలర్ ఎన్నికలలో కొన్ని కారణాలవల్ల నాకు అవకాశం రాకపోవడంతో పోటీ చేయలేదని , నాకు ఎలాంటి పదవి లేకుండా వార్డులో ప్రతి సమస్య నా సమస్యగా భావించి నా సొంత నిధులతో వార్డుని అభివృద్ధి చేసిన విషయం తమ అందరికీ తెలుసునని మరియు వార్డులో అత్యధికంగా ఉన్న నీటి సమస్య పరిష్కారం కోసం నా సొంత నిధులతో మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి పంపిణీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు, పిచ్చి మొక్కలతో వార్డులో కొన్ని వీధులలో విష సర్పాల సమస్య ఉండడంతో 36 గంటలు జెసిబి లు పెట్టి నా సొంత నిధులతో బాగుచేయించిన విషయం మీ అందరికీ తెలుసు, అలాగే వార్డులో దోమల బెడద అధికంగా ఉండడంతో నా సొంత ఖర్చులతో దోమల మందులు పిచికారి చేయించిన విషయం మీ అందరికీ తెలుసు, అందుకని వార్డు ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఎలాంటి పదవి లేకుండానే నాడు అభివృద్ధికి కృషి చేసిన నేను కౌన్సిలర్ అనే కార్డుతో అధికారులను నిలదీసి అభివృద్ధి పదంలో వార్డును నడిపించే అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను గెలిపించగలరు
అలాగే బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. 33వ వార్డులో మౌలిక వసతుల బలోపేతం, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.
వార్డు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, ప్రతి సమస్యను సీరియస్‌గా తీసుకొని పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. మాటలకే పరిమితం కాకుండా పనితోనే అభివృద్ధిని చూపిస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందితే 33వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలిపారు. వార్డు ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని ప్రచారానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో మొత్తం కృష్ణారెడ్డి, నరసింహారావు, కొండేటి రవీందర్ రెడ్డి, లావణ్య, సత్యవతి, రవి, చామకూరి రవి, లక్ష్మీకాంతరెడ్డి, రంగారెడ్డి, బిక్షం రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
33వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి మీల వంశీ నిర్వహిస్తున్న ప్రచారం రోజురోజుకూ మరింత ఉత్సాహంగా కొనసాగుతూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.