చంటి పాపతో నామినేషన్ కు వచ్చిన అభ్యర్థి
తిరుమలగిరి 30 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ చంటి పాపతో నామినేషన్ వేయడానికి అభ్యర్థిని వచ్చిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు నుంచి జనసేన పార్టీ తరపున గంట వనజ బరిలో నిలిచేందుకు నామినేషన్ వేసింది. 13వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి జనసేన పార్టీ ముఖ్య నాయకులు దుబ్బాక అశోక్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు