సర్దార్ సర్వాయి పాపన్న  గౌడ్ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి  

Aug 18, 2024 - 23:38
Aug 19, 2024 - 00:37
 0  12

చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలి.

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,

తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్

 (సూర్యాపేట టౌన్ ఆగస్టు 18) :- బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో దళిత, బహుజనలు రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ , తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు.  ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

 సర్వాయి పాపన్న గౌడ్ మొగల్ చక్రవర్తుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నాడు పోరాటం చేసి గోల్కొండ కోటను ఏలిన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. 60 శాతం ఉన్న బీసీలకు అటు చట్టసభల్లో ఇటు మంత్రి పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యత లేదని ఐదు నుంచి పది శాతం ఉన్న అగ్రకులాలకు చెందిన వారు 50% పైబడి పదవులు దక్కించుకున్నారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరగాలని ఆయన అన్నారు. దేశంలో 52% జనాభా కలిగి ఉన్న బీసీలు నేటికీ విద్య ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడి ఉన్నారని న్యాయసాధనకు కుల గణన చేపడుతామని 2018లో అప్పట్లో హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో ప్రకటించారని కానీ నేటికీ అది అమలు కాలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా బీసీలకు ప్రత్యేక మంత్రి పదవుల శాఖలు ఏర్పాటు చేయడంతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాలలో కులగలను చేపట్టాలని ఆయన అన్నారు.

మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రాథమిక కల్పించడంతోపాటు తెలంగాణ బీసీ కులాలకు తగిన న్యాయం చేకూర్చాలని ఆయన కోరారు. ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మంచి పద్ధతి కానీ కొంతమంది అధికారికంగా చేయలేదు. తెలంగాణకు తొలి బహుజన వీరుడు విప్లవకారుడు 12 మంది తో ఏర్పాటైన పాపన్న గౌడ్ సైన్యం 12వేల మంది సైన్యాన్ని తయారుచేసి బహుజన రాజ్యాన్ని నెలకొల్పిన చరిత్ర ఆయనకే దక్కిందన్నారు. పాపన్న గౌడ్ చరిత్రను ప్రతి ఒక్క బహుజన బిడ్డ తెలుసుకొని భవిష్యత్ తరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని కోరారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లా కేంద్రాలలో పాపన్న గౌడ్ విగ్రహాలను నెలకొల్పడంతో పాటు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ గౌడ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు రేసు నాగయ్య గౌడ్ ఉపాధ్యక్షుడు ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ అయితే గాని మల్లయ్య గౌడ్ శ్యాంసుందర్ రాపర్తి జానయ్య ప్రసాద్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333