దొంగ పాలైన పోలీసు కూతురి ఓటు

Feb 11, 2026 - 15:47
Feb 11, 2026 - 15:47
 0  4
దొంగ పాలైన పోలీసు కూతురి ఓటు

చందన ఓటుకు.. దొంగ ఓటర్ల చేటు..

మొదటి ఓటు వేసే అవకాశం..

కానీ దొంగల పాలైన ఓటు..

ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మొదటిసారిగా వచ్చిన ఓటు హక్కును వినియోగించుకుందామని ఆశగా పోలింగ్ కేంద్రానికి వెళ్లిన యువతికి ఊహించని షాక్ తగిలింది.అప్పటికే ఆమె ఓటును ఎవరో వేసి వెళ్ళిపోవడం చూసి దిగ్భ్రాంతికి గురైంది. పట్టణంలోని ఎనిమిదో వార్డులో చందన అనే యువతకి ఎదురైన పరిస్థితి ఇది. పైగా తన తండ్రి సత్యనారాయణ పోలీసు 

కావడం గమనార్హం. ఆమెకు మొట్టమొదటిసారి ఈ విడత ఓటు హక్కు వచ్చింది. తొలి ఓటును వినియోగించుకోవాలని ఉత్సాహంతో ఆమె పోలింగ్ కేంద్రానికి రాగా అక్కడ ఆమె ఓటు అప్పటికే ఎవరో వేసి ఉండడంతో ఆమె ఆవేదనకు గురైంది. కార్డులు పరిశీలించకుండా, ఫోటోలు చూడకుండా ఎన్నికల అధికారులు అలా ఓటు ఎలా వేయనిచ్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి ఓటు వేద్దామని ఎంతో ఆశతో వచ్చానని, కానీ తన ఓటు లేకపోవడం చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యానని అన్నారు. తన ఓటు విషయంలో అధికారులు చేసిన నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333