శ్రీ రామాలయం గట్టును తవ్వేస్తున్నారు
-ప్రమాదంలో శ్రీ సీతారాముల దేవస్థానం
-శ్రీరాముని కాపాడుకునేందుకు ప్రజల ఆవేదన...
-అధికారులు చర్యలు తీసుకోవాలని వినతి...
జోగులాంబ గద్వాల 11 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.- : మండలంలోని నీలహళ్లి గ్రామ సమీపాన ఉన్న శ్రీ సీతారాముల దేవస్థానం ఎంతో మహోన్నతమైన అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంది. అయితే కొందరు ఆ గట్టుకున్న ఎర్ర మట్టిని తవ్వేస్తున్నారు. చుట్టూ పంట పొలాలు పచ్చని వాతావరణంతో పక్షుల కిలకిల రాగాలతో ప్రశాంతంగా ఉండే ఈ దేవాలయానికి ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. ఈ గట్టు చుట్టూ ప్రభుత్వం కొంతమందికి వ్యవసాయం చేసుకునేందుకు కొంత కొంత భూమిని ఇచ్చింది దీనిని ఆసరాగా చేసుకుని అవసరానికి అన్నట్టుగా ఆ మట్టిని రాత్రి వేళలో ఎర్ర మట్టిని తరలిస్తున్నారు. దీని ద్వారా దేవాలయం అంచున ఉన్న పై పొర రోజు రోజుకు వర్షాలకు కోత గురై గట్టు కింద త్రవ్విన పాదుల్లో మట్టి చేరి దేవాలయమే కంటికి కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవసాయం చేసుకునేందుకు భూమిని అప్పచెప్తే తవ్వకాలు జరపడం ఎంతవరకు న్యాయమని ప్రజలు ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో శివ రాజా, రామాంజనేయులు, పల్లెన్న, రంగస్వామి, ఓబులప్ప, లొల్లి రంగన్న,కురుమన్న, సవరప్ప తదితరులు ఉన్నారు.