యూరియాపై  రైతులు ఆందోళన చెందవద్దు

Aug 26, 2025 - 19:52
 0  11
యూరియాపై  రైతులు ఆందోళన చెందవద్దు

చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు.ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను రైతులకు వెంటనే అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలి.యూరియా నిల్వలు, సరఫరాపై మంత్రి జూపల్లి కృష్ణారావు, సమీక్ష ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సరఫరాపై ఐడీఓసీలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ  సమీక్షలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, పర్ణిక రెడ్డి, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, డా. రాజేష్ రెడ్డి, డా. వంశీకృష్ణ, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు._ యూరియా విషయంలో కలెక్టర్లు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను రైతులకు వెంటనే అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులు, అధిక ధరలకు విక్రయించే ఫెర్టిలైజర్స్ షాప్ డీలర్స్ పై  కేసులు నమోదు చేయాలని, వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  కృత్రిమ కొరత సృష్టించే వారిపై, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రెస్ మీట్ లు పెట్టి రైతులకు భరోసా కల్పించాలని, .స్టాక్ వివరాలు వెల్లడించి, రైతుల్లో నెలకొన్న ఆందోళనను  తొలగించాలి సూచించారు.ముఖ్యంగా ప్రైవేట్ డీలర్ ల వద్ద ఉన్న స్టాక్ సక్రమంగా సరఫరా అయ్యేలా ఆయా జిల్లా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని అన్నారు._
యూరియా వ్యవసాయ సీజన్ ముగిసే వరకు ప్రతి ఎరువుల షాప్,పి. ఏ.సి.ఎస్ , ఆగ్రో సేవా కేంద్రాల వద్ద ఒక్కొక్క షాప్ కు ఒక అధికారినినియమించాలని,వారికి బాధ్యతలు అప్పగించాలని, యూరియా ఇండెంట్ ఎంత వచ్చింది స్టాక్ లభ్యత ఎంత ఉంది,ఎంత సరఫరా చేశారు? తదితర విషయాలపై పక్కాగా మానిటర్ చేయాలని అన్నారు.పోలీస్ అధికారులు కూడా వ్యవసాయ అధికారులు, ప్రతి షాప్ వారిగా నియమించిన అధికారులతో సమన్వయం చేసుకోవాలని, యూరియా సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని  ఆదేశించారు.రాబోయే రబీ సీజన్ కు సంబంధించి  రైతులకు ఎంత యూరియా అవసరమో అంచనా వేసి, వాస్తవ లెక్కలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి  జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇండెంట్ పంపాలని,ఆ ప్రతిపాదనలు బట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇండెంట్ పంపుతుందని వివరించారు.అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ. రాష్ట్రాలకు యూరియా కేటాయింపుల కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, రాష్ట్రాల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సరఫరా చేయాల్సిన కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదన్నారు.  కేంద్రం తెలంగాణకు  ఖరీఫ్ సీజనుకు 9.8  లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా చేయాలని, కానీ ఇప్పటివరకు కేవలం 6.6 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియానే సరఫరా చేసిందని, ఇంకా 3 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల  యూరియా సరఫరా చేయాల్సి ఉందని, దీంతో రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తూ.కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం  చేస్తున్నారని విమర్శించారు.యూరియా సరఫరా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. రైతుల అవసరాలను తీర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333