కోపునూర్ ఎస్సీ హాస్టల్ లో మదర్ తెరుస్సా జయంతి వేడుకలు 

Aug 26, 2025 - 19:51
 0  19
కోపునూర్ ఎస్సీ హాస్టల్ లో మదర్ తెరుస్సా జయంతి వేడుకలు 

చిన్నంబావి మండలం తెలంగాణ వార్త  : చిన్నoబావి,: మండల పరిధిలోని కొప్పునూర్ ఎస్సీ బాలుర హాస్టల్ లో ఈరోజు మంగళవారం ఉదయం జరిగిన ప్రేయర్ సమయలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ- ఈరోజు మదర్ తెరిస్సా పుట్టినరోజు.ఆమె యుగోస్లావిక దేశoలో జన్మించి 1929లో. మన భారత దేశానికి వచ్చి,దారిద్రంలో ఉన్న నిరు పేదలకి సేవ చేసేందుకు తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప మాతృమూర్తి.1950 లో కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను ఏర్పాటు చేసి,అనాధలు,రోగులు,పేదవారికి నిస్వార్తంగా తమ సేవలు అందించారు.అందుకు గుర్తుపింగా 1962 లో పద్మశ్రీ,1980 లో భారతరత్న పురస్కారాలను ఆమెకు మన భారత ప్రభుత్వం ప్రధానం చేసింది.అదేవిదంగా,మన హాస్టల్ విద్యార్థులు ఎవ్వరు ఆ మహాతల్లి చేసిన సేవలు మరచిపోవద్దు.అదేవిదంగా మనం ప్రతరోజు హాస్టలలో,స్కూల్ లో ఉచ్చరిస్తున్న భారతదేశం నా మాతృభూమి అనే గేయాన్ని పైనమర్రి వెంకట సుబ్బారావు అని గుర్తుంచుకోండి అన్నారు.మన విద్యార్థులు ఉదయం హాస్టల్ లో టిఫిన్ చేశాక,స్కూల్ కి వెళ్లే మధ్యలో ఎక్కడ కూడా కలుషిత నీళ్లు తాగవద్దని చెప్పారు.దానివల్ల వాంతులు,అనారోగ్యం కలుగుతుoది అన్నారు.ఈ కార్యక్రమం లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి తో పాటు విద్యార్థులు,వర్కర్స్ నరేష్ గోవిందు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333