ఎన్.పి.ఆర్.డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం

Nov 10, 2025 - 22:08
Nov 10, 2025 - 22:10
 0  5
ఎన్.పి.ఆర్.డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం

భువనగిరి 10 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 డిసెంబర్ 2న మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేస్తూ విడుదల చేసిన జీవో 34ను వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి ఆర్.డి) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వరూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం34 ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మధ్య జిల్లాలో అందుబాటులో ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని 2022 డిసెంబర్ 2వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం జీవో ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్న అమలు కావడం వారు ఆవేదన వ్యక్తం చేశారు.వికలాంగుల సంక్షేమం కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ను జిల్లా స్థాయిలో తిరిగి నియమించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా,శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేయడం వికలాంగులను మోసగించడమేనని వారు అన్నారు.జిల్లా స్థాయిలో వికలాంగులకు సమర్థవంతమైన సేవలు అందించడానికి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను విభజించాలని గత ప్రభుత్వం నిర్ణయం చేసింది.జీవో విడుదల అయి 3 సంవత్సరాలు అవుతున్న జీవో నెం34 అమలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వికలాంగులపై వివక్ష కనబరిస్తున్నట్టుగా ఉందని వారు ఈ సందర్భంగా అన్నారు. జీవో అమలు కాకపోవడం వలన వికలాంగుల సంక్షేమనికి చర్యలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరుగుతుందని.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో 34 ను అమలు చేసే విదంగా చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక పక్షాన డిమాండ్ చేస్తున్నామని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొత్త లలిత జిల్లా ఉపాధ్యక్షురాలు బర్ల పార్వతి హరిబాబు యాట చందు ఏం స్వామి గీత కుచ్చుల స్వామి కుచ్చుల జేరిష ఏషాల గోపి నోముల నరసింహ ఏం రాములు తదితరులు పాల్గొన్నారు.

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక