పర్యావరణ రక్షణ కోసం మట్టి గణేష్ విగ్రహాలను వినుయోగించుకోవాలి:జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల 6 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి.
గద్వాల్. జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ గణేష్ చతుర్థి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను సంతోషంగా, భక్తితో జరుపుకోవాలన్నారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణపతి ఆశీర్వాదాలతో జిల్లాలో ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలు, శాంతి, ఆర్ధిక స్థితి మెరుగుపడాలని ఆకాంక్షించారు. పర్యావరణ రక్షణ కోసం మట్టి గణేష్ విగ్రహాలను వినుయోగించుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిషేదించి, నీటి కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గణేష్ విగ్రహాల నిమజ్జన సమయంలో స్వచ్ఛత, క్రమశిక్షణ పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను కోరారు. నిమజ్జనానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన నది అగ్రహారం, జమ్మిచేడు, బీచ్ పల్లి, జూరాల డ్యాం ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలనీ ప్రజలకు తెలిపారు.
ప్రజలందరూ ఐకమత్యంతో ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కలెక్టర్ తెలిపారు.