మోత్కూర్ లో చోరీ 55,000 రూపాయలు డ్రా

మోత్కూర్ 26 జూలై 2025 తెలంగాణ వార్త మోత్కూర్:
మున్సిపల్ కేంద్రంలో మొబైల్ ఫోన్ల చోరీలు రోజురోజుకూ పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గుండాల మండలం వాస్తా కొండూరు గ్రామానికి చెందిన శ్రీరంగం సందీప్ అనే యువకుడుది మొబైల్ చోరీకి గురైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం 10:30 గంటల సమయంలో నల్గొండ కు వెళ్లేందుకు మోత్కూర్ బస్టాండ్‌కు వచ్చిన సందీప్, బస్సు ఓకే క్రమంలో తన మొబైల్ మిస్సైనట్లు గమనించాడు. వెంటనే మోత్కూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేశాడు. పోలీసుల సూచన మేరకు తన మొబైల్ నంబర్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకున్న సందీప్, అనంతరం మీ సేవ కేంద్రంలో ఫిర్యాదు నమోదు చేశాడు.అయితే, నంబర్ యాక్టివేట్ అయిన కొద్దిసేపటికే వరుసగా మెసేజ్‌లు రావడంతో అతను అవి పరిశీలించాడు. దాంతో తన బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా రూ.55,000 డ్రా చేసినట్లు సమాచారం తెలిసింది. తన మొబైల్ విలువ రూ.30,000 మాత్రమేనని, కానీ చోరీ చేసిన దొంగ డేటా ఆధారంగా బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం చేశాడని సందీప్ తెలిపాడు.ఈ విషయంపై మోత్కూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సి. వెంకటేశ్వర్లును వివరణ కోరగా, ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు తమ వద్దకు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు.ప్రస్తుతం మొబైల్ చోరీలు, వాటి ద్వారా జరగుతున్న ఆర్థిక మోసాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు....