క్షయ నివారణ అందరి బాధ్యత జిల్లా టిబి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు
జోగులాంబ గద్వాల 26 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల క్షయ వ్యాధిను నివారణ చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా టిబి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని చింతలపేట కాలనీ లో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు మొబైల్ ఎక్స్ రే క్యాంప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిబి లక్షణాలు ఉన్న వారు గళ్ళ పరీక్ష తప్పకుండా చేయించుకోవాలని ఆయన చెప్పారు. టిబి వచ్చినంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదని మందులు వాడితే క్షయవ్యాధి పూర్తిగా తగ్గుతుందని ఆయన స్పష్టం చేశారు. మందులతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలని అప్పుడే త్వరగా కోలుకొని ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ కిరణ్ కుమార్, సూపర్ వైజర్ శేకమ్మ ఏ ఎన్ ఎమ్ స్వర్ణలత, సుజాత, సుగుణ, డి పి సి వెంకటేష్, ఎక్స్ రే టెక్నీషియన్ ఉదయ్, ఆశా కార్యకర్తలు సుభాషిణి జయలక్ష్మి సుజాత కవిత మహేశ్వరి జ్యోతి అస్మా తదితరులు పాల్గొన్నారు.