శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క ను కలిసిన  గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి

Aug 2, 2025 - 19:31
 0  1
శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క ను కలిసిన   గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి

అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు

*ఫ్రీ పైమరి టీచర్స్ గా అంగన్వాడీ టీచర్లను తీసుకో
వాలి.*

జోగులాంబ గద్వాల 2 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల ఈరోజు హైదరాబాద్ లోని శిశు సంక్షేమ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలొ మంత్రివర్యులు సీతక్క అనసూయ గారిని  గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి . ఆధ్వర్యంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి ప్రభుత్వం త్వరలో తేబోతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీ ప్రైమరీ పాఠశాల నిర్వహణ కోసం  ఫ్రీ  పైమరి టీచర్స్ గా అంగన్వాడీ టీచర్లను తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.

అంగన్వాడీ ఉద్యోగులు వివరిస్తూ...

    గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ ఉద్యోగులుగా గౌరవ వేతనంతో పనిచేస్తూ ప్రభుత్వము ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలోకి తీసుకెళ్లడమే కాకుండా అనేక అదనపు ప్రభుత్వ కార్యక్రమాలను చేస్తున్నారు, 
ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ ప్రైమరి పాఠశాలల నిర్వహణకు వేరే వాలంటీర్లను నియమించడం కోసం జిఓ ను తేవడం జరిగిందని దానిని రద్దు పరచాలని,

      అంగన్వాడీ ఉద్యోగులు డిగ్రీలు, పీజీలతో పాటు ప్రీ స్కూల్ ట్రయినింగ్లు, జాబ్ కోర్స్ అర్బీ ట్రైనింగులు, ప్రీ స్కూల్ కార్యక్రమాల మీద పూర్తి అవగాహనా ఉన్నందున అర్హులైన అంగన్వాడీ ఉద్యోగులను నియమించాలని కోరారు.

ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు తదుపరి కార్యచరణను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలొ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు సౌధామిని, ఇందిరమ్మ, శ్రీలత, అనంత లక్ష్మి, సువర్ణ, వెంకట లక్ష్మి, శైలజ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333