ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని

Sep 30, 2024 - 17:08
 0  3
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని


అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత  అధికారులను ఆదేశించారు.....

సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు......

ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.

గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు....

సారపాక గ్రామం బూర్గంపాడు మండలం కి చెందిన కువారపు మంగ గత కొంతకాలంగా అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నానని సొంత స్థలం ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానని ప్రభుత్వం తరఫున ఇల్లు ఇప్పించాలని కోరుతూ చేసిన దరఖాస్తు ను పరిశీలించి  జిల్లా హౌసింగ్ శాఖకు ఎండార్స్ చేశారు....

* కొత్తగూడెం మేదర్  బస్తీకి చెందిన కానుకుర్తి ధనలక్ష్మి  గత 30 సంవత్సరాలుగా మేదర బస్తి రైల్వే కట్ట పక్కన ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నామని రైల్వే వారు అన్ని ఇల్లు తొలగించారని అందులో మా ఇల్లు కూడా ఉన్నదని ప్రభుత్వం వారు రామవరం బ్రిడ్జి పక్కన ఇళ్ల స్థలాలు కేటాయించారని తన కొడుకు  కానుకుర్తి రమేష్  పేరు మీద  343 ప్లాట్ వచ్చిందని  తన కొడుకు మరణించినందున  ఎమ్మార్వో వారు పట్టాను నా పేరు మీదుకు మార్చి ఇస్తామని చెప్పి వయసులో పెద్దదాని అయిన నన్ను రేపు రా ఎల్లుండి రాని గత సంవత్సరం నుండి తిప్పుతున్నారని ఆ ప్లాట్ యొక్క పట్టాన్ని నా పేరు మీద ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి కొత్తగూడెం తహసిల్దార్ కు ఎండార్స్  చేశారు.

* సారపాక గాంధీనగర్ కు చెందిన  కువ్వారపు ప్రణవి ఎనిమిదో తరగతి చదువుతున్నానని భద్రాచలం లిటిల్ ఫ్లవర్ స్కూల్ నందు ఫ్రీ  సీటు ఇప్పించగలరని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం   విద్యాశాఖ అధికారికి ఎండార్స్ చేశారు.  

* ఉప్పుసాక గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన గిరిజన ఆదివాసీలు బీసీ కులస్తులు ఎస్టీ లంబాడ కులస్తులు వారు సుమారు 100 కుటుంబాలు నివాసం ఉంటున్నామని గత 30 సంవత్సరాలు నుండి మాకు కరెంటు సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని రాత్రివేళలో విశేషాలు క్రిమికీటకాలు వల్ల మాకు ప్రాణహాని ఉన్నదని కరెంటు సదుపాయం లేక రాత్రివేళ దోమల బారిన పడి విష జ్వరాలు సోకి ఆస్పత్రి పాలవుతున్నామని మా ఇండ్లకు ఇంతవరకు ఇంటి పన్నులు పంచాయతీ వారు ఇవ్వడం లేదని మాకు వెంటనే కరెంటు సదుపాయము మరియు ఇంటి పనులు కట్టించుకొని రసీదులు కల్పించి మాకు న్యాయం చేయగలరని చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం  జిల్లా పంచాయతీ అధికారికి ఎండార్స్ చేశారు.

.పాల్వంచ పట్టణ పరిధిలోని    దమ్మపేట మెయిన్ రోడ్డు నుండి శివనగర్ ప్రవేశ రోడ్డు వరకు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసం అయినదని, దశాబ్ద కాలం నాడు నిర్మించినటువంటి కాలువలు చిన్నవి అయిపోయి వరద ఉధృతికి సరిపోక నీళ్లన్నీ రోడ్డు పైకి, ఇళ్లల్లోకి ప్రవేశించి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని కావున ధ్వంసమైన రోడ్డును పునర్నిర్మాణం మరియు ప్రధాన కాలువలు కూడికతీత మరియు పెద్దవిగా నిర్మించడం చేపట్టాలని శివనగర్ ప్రాంత వాసులు చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం  మున్సిపల్ కమిషనర్ పాల్వంచకు ఎండార్స్ చేశారు.


ఈ ప్రజావాణి కార్యక్రమంలో  డీఆర్డీఓ విద్యా చందన, అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333