ఘనంగా ప్రజా పాలన వేడుక
జాతీయ జెండాకు వందనం చేస్తున్న ఎస్ఐ శ్రీనివాస్.
జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి కేటీ దొడ్డి సెప్టెంబర్ 17:-తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా ఎస్సై త్రివర్ణ పతాకావిష్కరణ మరియు అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. అనంతరం జాతీయ గీతం ఆలకించారు.ఈ సందర్బంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ అంటే త్యాగమని, నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని, నిస్వార్థంగా తమ జీవితాలను పణంగా పెట్టి సర్వం కోల్పోయినా వెనుకంజ వేయని ఆ మహనీయుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని ఎస్సై కొనియాడారు.ఈ కార్యక్రమం లో హెడ్ కానిస్టేబుల్ లు శ్రీధర్, రంజిత్ ,తిమప్ప,కానిస్టేబుల్ లు శ్రావణి, ప్రభాకర్ ,దాస్ నాయుడు ,మహేష్ , రజిని బాబు,హోమ్ గార్డ్ శ్రీను, మోహన్ పాల్గొన్నారు.