ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించిన రాష్ట్ర మానిటరింగ్ అధికారి

Aug 2, 2025 - 19:33
 0  0
ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించిన రాష్ట్ర మానిటరింగ్ అధికారి
ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించిన రాష్ట్ర మానిటరింగ్ అధికారి
ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించిన రాష్ట్ర మానిటరింగ్ అధికారి

జోగులాంబ గద్వాల 2 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల  తేదీ. 02.8.2025 న. రాష్ట్ర మానిటరింగ్ అధికారి, ఫణిందర్ రెడ్డి. ఐఏఎస్, MD, TGMSIDC, మరియు కౌటిల్య ED, వేణుగోపాల్ EE, శ్రీనివాసులు EE, ప్రభుత్వాసుపత్రి లోని పలు వార్డులను సందర్శించి, ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు ఎంతమంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు, మరియు ఎంతమంది ఇన్ పేషెంట్లు గా సేవలు తీసుకుంటున్నారు, మరియు ప్రభుత్వ ఆస్పత్రిలో  ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి, మరియు సీజనల్ వ్యాధుల గురించి, సరఫరా అవుతున్న  మెడిసిన్స్ గురించి,  ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందజేస్తున్న సేవల గురించి, టి డి హబ్ లో చేస్తున్న రక్త పరీక్షల గురించి, ఫిజియోథెరపీ సెంటర్లో ప్రజలకు అందజేస్తున్న సేవల గురించి, చిన్నపిల్లల వార్డులో పిల్లలకు వైద్యులు అందజేస్తున్న  సేవలు గురించి, మెడికల్ సూపర్డెంట్, డాక్టర్. ఇందిరా మరియు డాక్టర్ అభినేష్ (RMO ), డాక్టర్ రాజు. ప్రోగ్రాం ఆఫీసర్, NCVBDC, ని అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు.. తదనంతరము ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో, సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ని సందర్శించి CMS కి సరఫరా అవుతున్న మెడిసిన్స్ గురించి తెలుసుకోని,  మెడికల్ సుపెరింటికీ, RMO కి, డాక్టర్లకి తగు సూచనలు సలహాలు ఇచ్చారు.. తదనంతరం ఆదిత్య హాస్పిటల్  ( ప్రవేట్ ) ని సందర్శించి, అవుట్ పేషంట్ రిజిస్టర్ మరియు ఇన్ పేషెంట్ రిజిస్టర్, రిఫరల్ రిజిస్టర్,మరియు ఇతర రికార్డులను పరిశీలించి, సీజనల్ వ్యాధుల గురించి ఎంక్వయిరీ చేశారు... ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది డాక్టర్ వినోద్, డాక్టర్ చైతన్య, వెంకటస్వామి ఫార్మసీ సూపర్వైజర్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ   వైద్య సిబ్బంది, డాక్టర్ జి. రాజు ప్రోగ్రామ్ ఆఫీసర్ NCVBDC, కే మధుసూదన్ రెడ్డి, శివన్న, నరసయ్య, రవికుమార్, మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333