మే డే ప్రాశస్త్యం-ప్రభుత్వా ల కర్తవ్యం
01...05....కార్మికదినోత్సవ వ్యాసం---- ప్రపంచవ్యాప్తంగా,ముఖ్య
ముగా భారతదేశములో అంతో,ఇంతో అమలవుతున్న కార్మిక చ
ట్టాలన్ని మేడే స్ఫూర్తిగా శ్రామికులు పోరాడి సాధించు
కున్నవే. 18వశతాభ్డంలో పారిశ్రామికవిప్లవం కారణంగాయంత్రాలు పెద్ద
మొత్తము లోకనుగొనబడడంతో పరిశ్రమల యజమా నులు పిల్లలతోసహ 18-20గంటల పని తీసుకొని హింసించేవారు. కార్మికులు యజమానులకు ఎన్నిసార్లు పనిగంటల తగ్గింపు కు వినతిపత్రం అందించినా కర్కశంగా వ్యవహరించి వారి అనారోగ్య ముకు కారణమైనారు.
8గంటలపనికి,వేతనాల పెంపు,ఆరోగ్య రక్షణవంటి డిమాండ్లతో సంఘటిత, అసంఘటితరంగ కార్మికులు 1886మే 1వతేదిన అమెరికాలోని ప్రధాన నగరాల్లో
సమ్మెప్రారంభించారు.30-50లక్షలమంది సమ్మె లో పాల్గొనగా పెట్టుబడిదా
రులగుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.
మే 3,4 తేదీలలోచికాగోలోను,ప్రధాన హే మార్కెట్లో యజమానుల దురాగతాలనడ్డుకోవడానికి పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించగా ప్రధానవక్తలు
మాట్లాడిన అనంతరం జరిగిన బాంబుపేలుళ్ళు,కా
ల్పుల సంఘటనకు కార్మికులను బాద్యులను
చేస్తూ 10మందిని అరెస్టుచేసి 17నెలలవిచార
న తర్వాత 5గురిని ఉరితీయగా మిగతావారికి
యావజ్జీవశిక్ష వేశారు. తాత్కాలికంగా ఉద్యమం
ఆగిన దీర్ఘకాలికంగా హక్కులను సాధించుకున్న
రుబలిదానాలు,త్యాగాలతో.
ఆమెరికా కార్మికుల పోరాటం,చికాగో కార్మికుల
బలిదానాల నేపథ్యంలో
1889లో పారిస్ నగరంలో
జరిగిన సెకండ్ ఇంటర్నేశన
ల్ కాంగ్రెస్ మహాసభ విశ్వ
వ్యాప్త8 గంటల పనిదినం
సాధనకు1890మే 1వతేది
ని అంతర్జాతీయ ప్రదర్శనా
దినోత్సవంగా తీర్మానించిన
ది.అదే ఆనాటినుండి ప్ర
పంచవ్యాప్తంగా మే, డే గా
కొనసాగుతుంది.
సామ్రాజ్యవాద విష కౌగి
లిలో ప్రపంచ వ్యాప్తంగా కా
ర్మికుల హక్కులు హరించి
వేయబడుతుoటి వామప
క్షాలు,ప్రజాసంఘాలు,అఖిలపక్షాల ఆధ్వర్యంలో కార్మికహక్కుల పరిరక్షణ పోరాటాలు కొనసాగుతున్నవి.
భారతదేశంలో 1923లో తొలిసారి మద్రాస్
నగరంలో లేబర్ అండ్ కిసానుపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించగా 1927 నుం
డి a.i.t.u.c.ఆధ్వర్యంలో
మే డే ఉత్సవాలను సంఘ
టితంగా దేశవ్యాప్తంగా
నిర్వహించడం ప్రారంభమైనది.
ఒక అంచనాప్రకారం దేశ
ములో 10కోట్లమంది వలసకార్మికులుంటే మరో
40కోట్లమంది అసంఘటిత
రంగంలో పనిచేస్తున్నారు.
క్రమంగా పరిశ్రమలు ప్రైవేటుపరం కావడంవల్ల
కార్మికచట్టాలు సరిగా అమలుకాకపోవడంవల్ల
పనులుకోల్పోయి,వేతనాలులేక ప్రస్తుతమైతే కరోనా
మహమ్మారి వల్ల వలసకార్మికులు పనికోల్పో
యి,స్వస్థలాలకు వందల
కిలోమీటర్లు పిల్లలతో సహా
కాలినడకనపోతూ తిండి
నీరు,లేక అలమ టించి అప్పులపాలైన విషయం మనందరికీ విదితమే. దేశంలోని 140కోట్ల జనాభాలో 80%మందిని
విధానకర్తలు పట్టించుకోని
కారణంగా కరోనాసమయంలో తప్ప
మనం ఏనాడు కార్మికుల
గురించి బహుశా ఆలో
చించివుండం.
ఇప్పటికైనా మేడే స్ఫూర్తి
గా ప్రభుత్వాలుబలమైన కార్మికచట్టాలతో,
రక్షణకల్పించి బలమైన
సామాజికవర్గంగా తయారుచేయవలసిన అవసరం ఎంతో ఉంది.
సమసమాజస్థాపనలో
వీరిని భాగస్వాములు చే
యనిదే అభివృద్ధికి అర్థం
లేదు. ఎందుకంటే వారు
చేసే మురికి,దుమ్ము,ధూళి
మట్టిలో నానుతూ మనకు
ఉత్పత్తిని,సౌకర్యాలను,విలాసాలను, సుఖాలను
అందిస్తున్న వారి దుర్భర
జీవితాలపట్ల మనకు సా
మాజికబాధ్యత,సానుభూతి,అవగాహన లేకపోతే
ఎలా ?ప్రభుత్వాలు,అన్ని
వర్గాలతో పాటు కార్మికుల గూర్చి ఆలోచించవలసిన
సమయం ఆసన్నమయ్యినది.
మేడే కార్మిక శుభాకాంక్షలతో"
వడ్డేపల్లి మల్లేశము
సా.కార్యకర్త,కవి,రచయిత
అధ్య జాగృతికళాసమితి
Po.హుస్నాబాద్.505467
జి.సిద్దిపేట 9014206412
తెలంగాణ రాష్ట్రం