పేదరికం అన్నింటా ప్రమాదకరమే.

*  పోషకాహార లోపంతో  నిస్సత్తువ ఆవరిస్తుంటే  బాల భారతాన్ని నిర్లక్ష్యం చేయడం తగునా ?

Aug 4, 2024 - 19:26
Aug 26, 2024 - 17:43
 0  3
పేదరికం అన్నింటా ప్రమాదకరమే.

ఆకలి సూచీలో అధమ స్థానంలో ఉన్న భారత్

బరువు తక్కువ పిల్లలతో  లక్ష్యాన్ని  సాధించేది ఎలా.?

ప్రత్యామ్నాయం లేని పేద వర్గాలకు  ఈ దుస్థితి నిండు అంధకారమే!

---  వడ్డేపల్లి మల్లేషము
హరిత విప్లవం యొక్క వికృత పరిణామం అధిక ఎరువుల వాడకం పురుగుమందుల  వినియోగంతో  వ్యవసాయ ఉత్పత్తుల్లో పోషకాలు తగ్గి రసాయన అవశేషాలు పెరిగి  ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నట్లు అనేక గణాంకాలు తెలియజేస్తుంటే  పేద వర్గాలు తినే వరి గోధుమ వంటి  వాటిలో పోషకాలు  దిగజారి పోతే వారికి ప్రత్యామ్నాయం ఏమిటి?  ఉన్నత వర్గాలు  పండ్లు ,కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, ఇతరత్రా ఖర్చుతో కూడుకున్న ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తారు కానీ పేద వర్గాలు  మూడు పూటలా పిడికెడు మెతుకులకే నోచుకోనప్పుడు,  కనీస అవసరాలు తీర్చుకునీ మానవాభివృద్ధికి చేరనప్పుడు, నిస్సత్వ ఆవరిస్తున్న పేద పిల్లల  పరిస్థితి అయోమయం కాక మరేమిటి?  కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా  వ్యవసాయం వ్యాపారం నిర్మాణ కార్యక్రమాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో  2020లో ప్రపంచవ్యాప్తంగా  కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారని  వారిలో ఎక్కువ మంది భారతీయులనీ ప్రపంచ బ్యాంకు నివేదిక  అంచనా వేసింది . కరోనా లాక్డౌన్ సమయంలో   చిన్నారులలో పోషకాహార లేమి స్పష్టంగా కనపడిందని  బరువు తక్కువ ఉండే పిల్ల సంఖ్యా భారతదేశంలో 14% గతంలో కంటే పెరిగిందని టిసిఐ సంస్థ తన  నివేదికలో వెల్లడించింది .అంతేకాదు ప్రపంచ ఆకలి సూచిలో  ఇంకా 111వ స్థానంలో ఉన్న భారత్  ఈ సమస్యను అధిగమించడానికి విస్తృతస్థాయిలో  చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ  నివేదిక నొక్కి చెబుతున్నది.  భారతదేశంలో  15%   జనాభాను పేదరికం పట్టిపీడిస్తున్నదని  గత సంవత్సరం నీతి ఆయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.  అంతర్జాతీయ యుద్ధ వాతావరణం  కారణంగా కూడా ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నింటి పేదవాళ్లు కొనలేని పరిస్థితిలో జారుకుంటే పెద్ద  వర్గాలకు చెందిన  చిన్నారులు మహిళలు   19 కోట్ల మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే  చేదు వాస్తవాన్ని ప్రకటించడం పాలకులకు కనువిప్పు కావాలి  .కరోనాకాలంలో సమీకృత శిశు అభివృద్ధి సేవలు కానీ పోషణ పథకాలు గాని  సరిగ్గా అమలు కాకపోవడం పాఠశాలలు మూ తబడడంతో మధ్యాహ్న భోజన పథకం కూడా నిలిచిపోవడం  వల్ల కూడా పేద వర్గాలు  అంతో ఇంతో  అందే ఆహారానికి దూరం కావడం పెను విషాదం.
   
పిల్లలకు పోషకాహారం అవసరం--  తీసుకోవలసిన తగు చర్యలు :-

కనీస ఆహారమే లేని దుస్థితిలో పోషకాహారం మాట ఎక్కడిది  పోషకాహారం ఉంటేనే కదా పిల్లలు  శారీరక మానసికంగా ఎదిగి  ఎత్తుకు తగిన బరువు సాధించి  చదువులోనూ ఆటపాటల్లోనూ నిత్యజీవిత కార్యక్రమాలను  హుషారుగా కొనసాగే ది. సూక్ష్మ పోషకాల లోపం కారణంగా రోగనిరోధక శక్తి తగ్గి  అనేక వ్యాధులకు గురవుతున్న నేపథ్యంలో  మానసికంగా సంసిద్ధంగా లేనప్పుడు చదువు నేర్చుకోవడం కూడా అసాధ్యమే.  2022 నాటికి దేశంలోని బాలలందరికీ సరైన పోషకాహారాన్ని  సరఫరా చేయడం ద్వారా  పోషకాల లేమి నుండి విముక్తి పొందాలని కేంద్రం  సంకల్పించిన అది సాధ్యం కాలేదు. అలాగే 2013 జాతియ ఆహార భద్రత చట్టం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు  ప్రకటించిన  దేశంలోని పేద వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతులతో పాటు ఆరోగ్యాన్ని పోషకాహారాన్ని సరఫరా చేయలేక బక్క చిక్కి రోగాల బారిన పడిన విషయం మనందరికీ తెలుసు  .అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్నటువంటి పౌష్టికాహారం  అనేక అవాంతరాల మధ్య నడుస్తుంటే ఇంకా చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నది కేవలం  దొడ్డు బియ్యం మాత్రమే కావడం అనేక రాష్ట్రాలలో  గోధుమల సరఫరా లేకపోవడం  నిజమైన ఆహార భద్రత అనిపించుకోదు.  బియ్యము పప్పులు నూనెలు, నిత్యవసరాలు  పోషకాహారాలు డ్రై ఫ్రూట్స్  వంటివి సరఫరా చేయడం ద్వారా  దారిద్ర రేఖ దిగువ నున్న వారికి ఎంతోకొంత ఆర్థిక సమతుల్యతను  కల్పించడానికి ఆరోగ్యాన్ని రక్షించడానికి సాధ్యమవుతుంది.  పోషకాహార లేమిని అధిగమించాలన్న , పిల్లలను ఆరోగ్య పరిరక్షణకు సంసిద్ధులను చేయాలన్న  వారికి సంబంధించి పాఠశాలల్లో ఇతరత్రా కూడా వైద్య పరీక్షలు నిర్వహించి  సరైన ఔషధాల సరఫరాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పోషకాహారాలను అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంకితమైతే మాత్రమే  సాధ్యమవుతుంది మధ్యాహ్న భోజనం లో  గుడ్డు సరఫరా చేస్తున్నప్పటికీ  కూరగాయలు పప్పులు ఇతరత్రా  మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు సరిపోయే స్థాయిలో సరఫరా చేసినప్పుడు మాత్రమే పోషకాలు పిల్లలకు అందుతాయి . గతంలో మాదిరిగా ఉత్పత్తి చేస్తున్న ధాన్యాలలో పోషకాహారాలు సమృద్ధిగా ఉండాలంటే  రసాయన పురుగు మందులు ఎరువులను భారీగా తగ్గించి సేంద్రియ ప్రత్యామ్నాయ విధానాల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి .   వ్యవసాయ రంగ పరిశోధనకు భారీ మొత్తంలో ఖర్చు చేయడంతో పాటు  చీడపీడలను తట్టుకునే వంగడాలను  తయారు చేయడం వల్ల కూడా పోషకాలను  సమకూర్చుకునే అవకాశం  ఉన్నది.  2047 నాటికి  దేశాభివృద్ధి లక్ష్యంగా  ప్రణాళికలు తమకున్నాయని,    2025 చివరినాటికి ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థతో  మూడవ స్థానానికి చేరుకుంటామని  ప్రకటనలు గుప్పిస్తున్న భారత ప్రభుత్వం  పిల్లల్లో పోషకాహారలేమిని ముఖ్యంగా పేద వర్గాలలో  నిర్మూలించడంతోపాటు  దేశంలోని ప్రజలందరికీ   పోషకాహారాన్ని సరఫరా చేసి  దృఢమైన ఆరోగ్యవంతమైన భారతావనినీ సా కారం చేసుకోవలసిన అవసరం ఉంది.  కేంద్రం రాష్ట్రాల సహకారంతో  జవాబుదారీగా పనిచేసి  అందుకు తగిన స్థాయిలో సవాలు విసరాలి  .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అ  అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యు  హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333