ఆర్థిక సంక్షోభం, విధ్వంసం, అవినీతి, అణచివేత, హామీల విస్మరణ బి ఆర్ ఎస్ చిరునామా

Apr 6, 2024 - 20:58
 0  1

ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకెక్కడిది .? 

పౌర ప్రజాసంఘాలకు మాత్రమే ఆ అర్హత ఉంది .

ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మీ చరిత్ర  అందరికీ తెలుసు.

 బెదిరింపులు, హెచ్చరికలు, మొరటు భాష మానుకొని నిర్మాణాత్మక పాత్ర పోషిస్తే మంచిది.

---  వడ్డేపల్లి మల్లేశం

చట్టసభలకు సచివాలయాలకు రానటువంటి ముఖ్యమంత్రి  ప్రతిపక్ష నాయకులు  ఉన్నటువంటి మన భారతదేశంలో  వీళ్లకు ఏ రకంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు . చట్టసభలను గౌరవించరు, సచివాలయాన్ని  ప్రజల కేంద్రంగా గుర్తించరు,  ఓట్ల కోసం మాత్రం ప్రజల మధ్యన చేరి లేనిపోని ఆరోపణలు చేస్తూ మొరటు భాషతో  బెదిరింపులు హెచ్చరికలతో  కాలం గడిపే  దురుసుతనానికి కాలం చెల్లింది . ఈ విధానం అమలవుతున్నటువంటి  రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు.  దత్త పుత్రుడు,  పెద్దాయన, అని చంద్రబాబును ఏకవచనముతో ఆంధ్ర ప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి  ప్రస్తావిస్తే  తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షానికి దిగిన  టిఆర్ఎస్ అధినేత  ఇతర మంత్రులు కూడా  ప్రజల ఆమోదం మేర కు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరికలు బెదిరింపులతో లొంగ తీసుకోవాలని ప్రయత్నించడం దారుణం.బాధ్యతలు గాలికి వదిలి ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి  ప్రభుత్వాన్ని విమర్శించే కనీస  హక్కు  టిఆర్ఎస్కు లేదు అని గుర్తించడం అవసరం.

కొన్ని వాస్తవాలను పరిశీలిస్తే :-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత నిర్వహించిన చట్టసభలలోకి  రానీ మాజీ ముఖ్యమంత్రి brs  అధినేత  తన సహచరులతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన దాడి చేయించిన కొంతకాలం తర్వాత  ఇటీవల కాలంలో టిఆర్ఎస్ నుండి రోజుకు కొంతమంది పార్టీ మారడంతో ఖాళీ అవుతున్న నేపథ్యంలో  ఆత్మన్యూనత కు గురై  రెచ్చిపోయి మాట్లాడుతున్న తీరు అక్షే పనీయం. ఆ పదాలను ప్రభుత్వం పట్ల వాడకూడదు  అంతేకాకుండా పంటలు ఎండిపోతున్నాయని, నీళ్లను విడుదల చేయాలని, మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి నీటిని నిలువ చేయాలని , ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25 వేలు నష్టపరిహారం చెల్లించాలని మాట్లాడిన మాటలన్నీ  తమ పరిపాలనలో అమలు చేసి ఉంటే కదా అనడానికి  .ముఖ్యమంత్రి మంత్రి వర్గాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు  పంట పొలాల పరిశీలనలో భాగంగా మాట్లాడుతూ " వెంట పడతాం, తరిమికొడతాం ,బుద్ధుందా, తెలివి లేదు , సోయి లేదు,  దద్దమ్మ ప్రభుత్వం, సన్నాసులు , కనీస అవగాహన లేదు, మెడలు వంచుతాం అంటూ అనరాని మాటలు బూతు భాష మొరటు పదాలతో  రాజ్యాంగబద్ధంగా ప్రజల ఆమోదంతో ఎన్నికైన ప్రభుత్వాన్ని విమర్శించడం ముందుగా రాజ్యాంగ ద్రోహం.  ఆ నేరానికి శిక్ష ఏమిటో రాజ్యాంగ నిపుణులు ఆలోచించాలి.

 లక్ష రూపాయల రుణమాఫీ కి హామీ ఇచ్చి కూడా పదేళ్లలో చివరి వరకు కూడా అమలు చేయక కంటితుడుపుగా అమలు విషయం అందరికీ తెలిసిందే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం హామీ ఇచ్చి  అభాసు పాలైన తీరు అంతేకాకుండా నాణ్యత లేకుండా కూలిపోయిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. కాలేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఇతర బా రాజుల పిల్లర్లు వంగిపోయి  కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్టుగా  ఆరోపణలు,  కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ  విమర్శలు మనకు ఉండనే ఉన్నాయి.

 ఆ అంశంపై ఇప్పటికి సమాధానం లేదు  లక్ష కోట్ల అవినీతికి పాల్పడినట్లు గత ముఖ్యమంత్రి పైన  పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణకు సమాధానం లేదు.  గత సంవత్సరం  మంటలు ఎండి ప్రకృతి విభత్సాల కారణంగా కరువు ఏర్పడినప్పుడు  ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తామని కంటి తుడుపుగా వ్యవహరించిన తీరు ప్రతిపక్షాల విమర్శకు గురైన ఆ ప్రభుత్వం స్పందించలేదు.  దళితుడిని ముఖ్యమంత్రి చేయక చేసిన ద్రోహానికి ఇప్పటివరకు శిక్ష పడలేదు. సమాధానం లేదు . దళితులకు మూడెకరాల పంపిణీ చేస్తానని మాట ఇచ్చి అమలు చేయలేదు  .ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎలాంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించలేదు.  లక్షలాదిగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయకపోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నిర్వీర్యం చేసి పేపర్ లీకేజీలతో రాష్ట్ర ప్రతిష్ట ఆ ప్రతిష్ట పాలు చేసిన విషయం తెలిసిందే .వీటన్నింటికీ గత ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు  బుద్ధి జీవులు మేధావులు పౌర హక్కుల సంఘాలు విప్లవ రచయితల సంఘాల వంటి  సంస్థలు సభలు సమావేశాలు పెట్టుకోవడానికి అనుమతించక నిర్బంధం చేసిన విషయం తెలిసిందే . ఇందిరా పార్క్ ను  నిషేధించి హక్కులను ఖూనీ చేసిన ఆ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎక్కడిది?  కలెక్టర్లు మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి  పాదాలకు నమస్కారము చేసిన రోజే తెలంగాణ ఆత్మగౌరవం గంగలో కలిసినది. అలాంటి వారికి  ప్రతిపక్ష హోదా ఎక్కడిది? ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎక్కడిది?  అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల ఇస్జరాజ్యంగా  వాడుకొని అణచివేతకు  పాల్పడి ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం కేసీఆర్ గారు పోలీసులకు  అనచి వేతకు పాల్పడకూడదని నీతి వాక్యాలు అందిస్తుంటే వాటిని ఎలా చూడాలి ?భూస్వాములకు రైతుబంధు ఇచ్చి ప్రజాధనాన్ని లూటీ చేసిన మిమ్ములను నేరస్తులుగా నిలబెట్టకపోవడమే పౌరసమాజం చేసిన పెద్ద తప్పు.

  బుద్ధి జీవులు మేధావులు పౌర సంఘాలతో ప్రస్తుత ప్రభుత్వం సభలు సమావేశం ఏర్పాటు చేసి వారి సలహా తీసుకుంటున్నది.  గత ప్రభుత్వం ఏనాడైనా మేధావులను సంప్రదించినదా? అలాంటి పౌర ప్రజాస్వామ్య హక్కులను రక్షించని  మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. పoటలు ఎండిపోవడానికి, కరువు కాటకాలు రావడానికి , రాష్ట్రం అప్పులపాలై సంక్షోభంలో కూరుకుపోవడా నికి, ఇచ్చిన హామీలను వంద రోజుల లోపల అమలు చేయకపోవడానికి గల కారణాలను .... పదిఏళ్ల మీ పరిపాలనను,  150 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను
  మేధావులు న్యాయ రాజ్యాంగ నిపుణుల ఆధ్వర్యంలో చర్చిస్తే  అసలు రంగు బయటపడుతుంది. నేరం ఎవరిదో తెలిసిపోతుంది.  బెదిరింపులకు హెచ్చరికలకు కళ్లెం పడుతుంది. నేరస్తులకు శిక్ష పడుతుంది జరగాల్సింది ఇది . ప్రజల సంక్షేమం అభివృద్ధి నీటిపారుదల అవకాశాలు కరువు కాటకాల నివారణ  ఏ ప్రభుత్వంలోనైనా కొనసాగాల్సిందే కానీ ఆ పరిస్థితులకు  కారణమైన గత ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి  ఇతరులపై లేనిపోని అబాండాలు మోపడమే ఇక్కడ చర్చనీయాంశం.. ప్రజా క్షేత్రంలో కోట్లాదిమంది ప్రజలందరూ చూడగా ఈ చర్చ జరగాలి.  తప్పులకు పూర్తి బాధ్యతను నేరస్తులపై మోపి,  అవినీతి, బంధుప్రీతి,  విధ్వంసం, ఆర్థిక అరాచకత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊగులో  నెట్టిన తీరు,  బాధ్యతారాహిత్యం వంటి అంశాల పైన  చర్చ జరిగితేనే  గత ప్రభుత్వం తన తప్పు తెలుసుకుంటుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది.  ఆ బాధ్యత పౌర సమాజం  బుద్ధి జీవులు మేధావుల పైన ఉన్నది.బుద్ధిజీవులు మౌనంగా ఉంటే  ప్రతిపక్షమని గర్వపడుతున్న టిఆర్ఎస్ మరిన్ని దాడులకు పూనుకునే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రజాస్వామ్యం కళ్ళముందే కూని అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత కలిగిన పౌర ప్రజా సంఘాలు వెంటనే జోక్యం చేసుకొని  ప్రతిపక్షమైన టిఆర్ఎస్ పార్టీకి కళ్లెం వేసి  బోనులో నిలబెట్టి నేరాలను ఒక్కొక్కటిగా ప్రజల ముందు విప్పి రుజువు చేయాలి.  అప్పుడు మాత్రమే ఈ చౌకబారు ప్రచారాలు, విమర్శలు, ఆరోపణలకు కళ్లెం వేయవచ్చు. స్థిరమైన పరిపాలనను తెలంగాణ రాష్ట్రంలో సాధించవచ్చు.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేష టు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333