మూత బడిన పాఠశాలలు వెంటనే తెరిపించాలి- డీటీఫ్

Aug 22, 2024 - 19:32
 0  3
మూత బడిన పాఠశాలలు వెంటనే తెరిపించాలి- డీటీఫ్

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్  మూత బడిన పాఠశాలలు వెంటనే తెరిపించాలి- డీటీఫ్ . ఆత్మకూరు ఎస్ మండలంలో తేది.22.08.2024 న డి టి ఎఫ్ సభ్యత్వ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు ఎస్ మండలంలోనీ వివిధ పాఠశాలలు కోటినాయక్ తండ,ఎనుబాముల, ఆత్మకూరు ఎస్,ఏపూర్,రామన్నగూడెం, ముక్కుడుదేవి పల్లి, ఇస్థాల పురం, పాతర్ల పహాడ్, కేబిఎస్ తండ మొదలైన పాఠశాలల్లో జరిగింది. ఈ కార్య క్రమంలో డిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కె. వేణు మాట్లాడుతూ మండలంలో మూత బడిన పాఠశాలలను వెంటనే తెరిపించాలన్నారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి అన్నారు. ఈ కార్య క్రమంలో డిటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పి.వెంకటేశ్వర్లు,కే. యోగానంద్, డిటీఎఫ్ మండల బాధ్యులు ఆర్.సుధాకర్,బీ.వెంకటేశ్వర్లు,వై. చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.