విబి జి రామ్ జి చట్టాన్ని రద్దు చేసి,పాత చట్టాన్ని కొనసాగించాలని

ఉపాధి కార్మికులు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి  బొల్లు యాదగిరి

Mar 28, 2026 - 20:20
Mar 28, 2026 - 20:20
 0  4
విబి జి రామ్ జి చట్టాన్ని రద్దు చేసి,పాత చట్టాన్ని కొనసాగించాలని
విబి జి రామ్ జి చట్టాన్ని రద్దు చేసి,పాత చట్టాన్ని కొనసాగించాలని

అడ్డగూడూరు 29 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– మోడీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల, పేదల పోట్ట గోట్టడానికి తీసుకువచ్చిన విబి - జి రామ్ జి చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఇప్పటికైనా ఉపాధి హామీ కార్మికులు పనిచేసిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరినారు.శనివారం  అడ్డగూడూరు మండల పరిధిలోని జనాకిపురం  గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికుల పని ప్రదేశాన్ని సందర్శించిన అనంతరం వారి సమస్యలను తెలుసుకోనున్న నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బొల్లు యాదగిరి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి గ్రామీణ పేదలకు, వ్యవసాయ కార్మికులకు రెండు పూటల బువ్వ పెడుతు, ఆర్థికంగా ఉపయోగపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తుందని విమర్శించారు.

అధికారం చేపట్టిన ఈ 11 సంవత్సరాల నుండి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఉపాధి హామీ కార్మికులను అనేక ఇబ్బందులు పెట్టారని అన్నారు. పని ప్రదేశాల్లో తాగడానికి నీళ్లు ఇవ్వకుండా, నిలువ నీడ లేకుండా, వారం వారం చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా, పనిచేస్తున్నప్పుడు ఫోటోలు దిగి పెట్టాలని వేధించారని వేధిస్తున్నారని అన్నారు. ఇప్పుడేమో అసలు ఉపాధి హామీ చట్టం లేకుండా జి రామ్ జి చట్టం తెచ్చి ఉపాధి హామీ కార్మికుల హక్కులను కూడా కాలరాసారని అన్నారు.100% నిధులనుండి కేంద్రం తప్పుకొని రాష్ట్రా ప్రభుత్వాలు కూడా 40 శాతం నిధులు ఖర్చు చేయాలని పేరుతో ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని ఈ కుట్రలను కార్మికులు ఐక్యంగా పోరాడాలని అన్నారు. తిప్పికొట్టాలని  పిలుపునిచ్చారు. నాలుగు నెలలకు పైగా కార్మికులకు చేసిన పనికి డబ్బులు చెల్లించకపోతే కుటుంబాలు ఏ విధంగా గడుస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాబు కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు నూతన జాబు కార్డులు ఇవ్వడం లేదని అన్నారు. అనేకమంది పని లేక జాబు కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, నూతన జాబు కార్డులు ఇవ్వాలని, జి రామ్ జి చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా పాత చట్టాన్ని అమలు చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని యాదగిరి కోరినారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు రాచకొండ రాములమ్మ సిపిఎం మండల కార్యదర్శి బుర్ర అనిల్ కుమార్, రైతు సంగం నాయకులు బండి లక్ష్మీనరసింహస్వామి,రామలింగం, పద్మ ,చింత యాదగిరి, అనిత ,యాదమ్మ ,తదితరులు పాల్గొన్నారు.