ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధొన్మాద దాడులను నిరసిస్తూ
నేడు (మార్చి 29న) హైదరాబాదులో జరుగు శాంతి ర్యాలీ ని జయప్రదం చేయండి.
- కొత్తపల్లి రేణుక సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి
సూర్యాపేట, 28 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– అరబ్ దేశంలో ఆయిల్ పెత్తనం కోసం అమెరికా సామ్రాజ్యవాదం ఆ దేశ అధ్యక్షుల్ని నిర్బంధించి భయం బ్రతుకులు గుర్తిస్తూ అరబుదేశాలను ఆక్రమిస్తున్న క్రమంలో ఇరాన్ పై ఇజ్రాయిల్ని ఉసుగుల్పి ఇరాన్ ప్రజల పైన, ప్రభుత్వం పైన మిస్సయిల్స్ తో యుద్ధం చేయడాన్ని ప్రపంచ దేశాలు మరియు ప్రజాస్వామ్య వాదులు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నప్పటికీ అమెరికా తన ఆధిపత్య ధోరణి కొనసాగుతూనే ఉన్నది దీన్ని వెంటనే ఆపాలని ప్రపంచశాంతిని నెలకొల్పాలని ఇరాన్ పైన అమెరికా సాగిస్తున్న మరణకాండను ప్రజలు ప్రజా స్వమిక వాదులు ఖండించాలని నేడు (మార్చి 29న) హైదరాబాదులో జరుగు శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఐ (ఎం.ఎల్ )మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక అన్నారు.ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ లెనిన్ నగర్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ యుద్ధం వల్ల ప్రపంచ ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి స్థితి ఉన్నది అన్నారు.ఇరాన్ లో ప్రజలు ఇప్పటికే వేలాదిమంది చిన్న పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇరాన్ లో మొత్తం కూడా రక్తపుటేరులతోని వీధుల్లో నిండినటువంటి పరిస్థితి ఉన్నది అన్నారు.ప్రపంచ ఆధిపత్యం కోసం చిన్నపిల్లలను సైతం చంపుతున్నటువంటి అమెరికా చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలని ఈ నరవేదాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండించకపోవడం విచారకరమని వారు అన్నారు. యుద్ధము ఆపి ప్రపంచ శాంతిని నెలకొల్పాలని హైదరాబాద్ జరిగే నిరసన ర్యాలీలో ప్రజలు ప్రజాస్వామిక వాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య , పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, సహాయ కార్యదర్శి సంతోషిమాత, కోశాధికారి జయమ్మ, గులాం హుస్సేన్, మోహన్, ఐతరాజు పద్మ, భీమనపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు.