ఎలాంటి అనుమతి లేకుండా జెసిపితో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 20 ట్రాక్టర్లు పట్టివేత

ఎస్సై వెంకట్ రెడ్డి

Mar 28, 2026 - 22:55
Mar 28, 2026 - 22:56
 0  4

అడ్డగూడూరు 28 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని అజీంపేట గ్రామ ట్రాక్టర్లు శివారులో ఉన్న మూసి వాగు నుంచి శనివారం రోజు మధ్యాహ్నం నుండి ఆజింపేట గ్రామంలోని 20 ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని ట్రాక్టర్లను,జెసిపినీ సీజ్ చేసినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రెవెన్యూ వారి ఫిర్యాదు మేరకు అడ్డగూడూరు పోలీసు వారు ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.