స్వామి స్థిత ప్ర జ్ఞానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో నిర్వ హించిన శ్రీ సీతారాము లకళ్యాణం పట్టాభిషేకం
భద్రాచలం శుభం ఫంక్షన్ హాలు నందు నిజమైన గోత్ర ప్రవరలతో శనివారం నిర్వహించిన సీతారాముల కళ్యాణం.
భద్రాచలం, 28 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– దివ్య క్షేత్రం భద్రాచలంలో శుక్రవారం నిర్వహించిన సీతారాముల కళ్యాణం లో అసత్యగోత్ర ప్రవరలు మృతా సౌచ0 ఉన్న అర్చకస్వామి ప్రధాన పాత్ర నిర్వహించడం వల్ల భక్తులు తీవ్ర మనోవేదనచెందారు. సీతారాముల కళ్యాణం ప్రత్యక్షంగా కళ్యాణ మడప సమీపంలో ఉండి తిలకించిన స్థిత ప్రజ్ఞా నంద స్వామి వారు అసంతృప్తి చెందడంతో, జగదానందకారకుడైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో అపసృతులు జరగడం మంచి సాంప్రదాయం కాదని స్వామీజీ తెలిపారు. ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణం లో అపసృతులు లేకుండా అంగరంగ వైభవంతో పాటు జగదానందకారకంగా జరిపించాలని స్వామీజీ పేర్కొన్నారు.
గత దశాబ్ద కాలం పైగా కేవలం కొద్దిమంది ప్రాబల్యం కోసం అంతా మా ఇష్టం అనే విధంగా నిర్వహిస్తూ దైవాపచారం చేస్తున్నారని, కావాలని చేస్తున్న అపచారం తొలగి సర్వేజనా సుఖినోభవంతు గా ప్రజలు సుఖంగా జీవించాల నే ఉద్దేశంతో భద్రాచలం శుభం ఫంక్షన్ హాల్ లో నిజమైన గోత్ర ప్రవరలతో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా స్వామి వారి అనుగ్రహం పొందే విధంగా నిర్వహించడం జరిగిందని కళ్యాణం తో పాటు పుష్యమి నక్షత్రం అయినందున స్వామివారికి మకుట ధారణ కూడా నిర్వహించడం జరిగిందని, స్వామీజీ తెలియజేస్తూ రామానుగ్రహంతో మన దేశం, ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని స్వామీజీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో బూసి రెడ్డి శంకర్ రెడ్డి దంపతులు ఫంక్షన్ హాల్ నిర్వాహకులు శేషు దంపతులు, ఇతర భక్తులు ఈ కళ్యాణ క్రతువు లో పాల్గొన్నారు.
ఈ మహత్కార్యంలో బూసి రెడ్డి, శంకర్ రెడ్డి రామావఝల, రవికుమార్, రాయప్రోలు రాధాకృష్ణ శాస్త్రి, సత్య ప్రసాద్ శర్మ, వీరభద్ర శాస్త్రి, రామాచార్యులు, విగ్రహ దాత హనుమంతరావు, మొదలగు వారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. అనంతరం స్వామివారికి నివేదించిన చక్కెర పొంగలి, బెల్లం పానకం, పులిహార భక్తులకు పంపిణీ చేయడం జరిగింది, జైశ్రీరామ్ జై జై భద్రాచలం సీతా రామ్, సర్వేజనా సుఖినోభవంతు అంటూ భక్తులు నినదించారు.