సరస్వతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
జోగులాంబ గద్వాల 22 మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి ఇట్టి వాలీబాల్ టోర్నమెంట్ ను పాఠశాల డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించడం జరిగినది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులు చదువుతోపాటు మానసిక ఉల్లాసంతో క్రీడల్లో కూడా తమ ప్రతిభను మెరుగుపరచుకుంటే శారీరకంగా మరియు మానసికంగా ఒత్తిడికి గురికాకుండా ఉంటారని విద్యార్థులకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని బయటకు తీయడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు.
ఇట్టి వాలీబాల్ టోర్నమెంట్ కు వచ్చిన క్రీడాకారులందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియపరచారు.
1.శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ CBSE స్కూల్ ఏ/సి క్యాంపస్ విద్యార్థులు.
2.శ్రీ రాఘవేంద్ర హై స్కూల్ శాంతినగర్ విద్యార్థులు.
3.సంస్కార్ స్కూల్ గద్వాల్ విద్యార్థులు.
4.శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ మెయిన్ క్యాంపస్ విద్యార్థులు.
మరియు
5.అబ్రహం స్కూల్ విద్యార్థులు పాల్గొనడం జరిగినది.
ఇందులో భాగంగా 7వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి తరగతి నుండి ముగ్గురు విద్యార్థులు మాత్రమే క్రీడల్లో పాల్గొనాలని సూచనలు చేసి పాల్గొన్నారు.
మొదటి బహుమతి శ్రీ రాఘవేంద్ర హై స్కూల్ విద్యార్థులు గెలుపొందడం జరిగినది.
రెండవ బహుమతి ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ మెయిన్ క్యాంపస్ విద్యార్థులు గెలుపొందడం జరిగినది.
గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి సర్టిఫికెట్, మేమెంటో, సీల్డ్, ప్రశంస పత్రం ప్రధానం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు లాలు, నరేంద్ర, ప్రియాంక, అరుణ్ కుమార్, అనిల్, నాగరాజు, వినోద్, వంశీ, రవి మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.