జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ బదిలీ

Feb 26, 2026 - 19:12
 0  2
జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ బదిలీ

గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియామకం

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ (IAS 2017) బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయనను గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వహించిన సబ్యసాచి ఘోష్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

కాగా, సంతోష్ స్థానంలో జోగులాంబ గద్వాల జిల్లా కొత్త కలెక్టర్‌గా ప్రస్తుతం జనగామ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రిజ్వాన్ భాషా షేక్ (IAS 2017) నియమితులయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరు తక్షణమే తమ కొత్త బాధ్యతల్లో చేరనున్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333