అనంతరం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఆందోళన ...మందు డబ్బాలతో నిరసన

Mar 22, 2026 - 13:12
 0  427
అనంతరం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఆందోళన ...మందు డబ్బాలతో నిరసన

  పూర్తయిన ఇండ్లు కూడా నిరుపయోగం..

గ్రామస్తులు ముందుగానే ఆక్రమణలు.. 

మనుషులకు బదులుగా మూగజీవాలకు అంకితం

ఒక్కరు నాలుగిండ్లు ఆక్రమణ... 

 ఇండ్లను ఆక్రమించుకున్న నిరుపేదలు .. 

మందు డబ్బాలతో నిరసన .. 

చిన్న పిల్లలను ముసలి వాళ్ళను చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న స్థానికులు.... 

తిరుమలగిరి 22 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తెలంగాణలో వేలాది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మౌలిక వసతులు (నీరు, విద్యుత్) లేకపోవడం మరియు అసంపూర్తి పనుల వల్ల నిరుపయోగంగా మారాయి.. గత ప్రభుత్వ హాయంలో నిరుపేదలకు డబల్ బెడ్రూంలు కేటాయించడం కోసం నిర్మించిన ఇండ్లు కొన్ని పూర్తికాగా మరికొన్ని అసంపూర్తిగా వదిలేసిన వైనం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతరం గ్రామంలో పూర్తికాక ముందే అట్టడుగు స్థాయిలో నిలిచిపోయినట్లు స్పష్టమవుతోంది. పూర్తయిన ఇండ్లు కూడా ప్రజలకు కేటాయించక పోవడంతో అవి నిరుపయోగంగా మారి శిథిలావస్థలో ఉండిపోతున్నాయి.తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చేరువలోని అనంతారం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల పరిస్థితి దారుణంగా మారింది. కొన్నింటిని రైతులు పశువుల కొట్టాలుగా వినియోగిస్తున్నారు. గడ్డివాములు నిల్వ చేసుకునే గోదాంలుగా మార్చేశారు. పాక్షిక నిర్మాణంలో ఉన్న గృహాలలో అక్రమ కార్యకలాపాలకు అవకాశం ఉన్నట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి గోడలు పగుళ్లు పెడుతున్నాయి.. పైకప్పులు వదులై పోతున్నాయి.. శుభ్రత, రక్షణ లేక పాడుబడుతున్న ఈ ఇండ్లను చూసి ప్రజలు బాధపడుతున్నారు.పూర్తి స్థాయి కేటాయింపులు జరగకపోవడంతో కొంతమంది గ్రామస్తులు ఇప్పటికే ఇండ్లను ఆక్రమించుకుని ‘మనవే’ అన్నట్లుగా పాగా వేసి ఉంటున్నారు. తిరుమలగిరి మండలం లోని పలు గ్రామాలకు చెందిన నిరుపేదలు దాదాపు 30 రోజుల నుండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకొని జీవనం కొనసాగిస్తుండగా

 అనంతరంనికి చెందిన భూ ఆ సాములు బర్లకు గొర్రెలకు గడ్డి కట్టలకు ఎడ్ల బండ్లకు ట్రాక్టర్ల కోసం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మొత్తం ఆక్రమించుకున్నారు నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి ప్రజాధనంతో కట్టిన ఇండ్లలో ప్రజలు ఉండాలే ఈ పశువులను ఎందుకు కట్టేస్తారని ఇండ్లు లేనటువంటి పేదవారు వచ్చి గత నెల రోజులుగా బయటనే వండుకుంటూ ఎండలో నివసిస్తున్నారు ఈ బండ్లని గొర్లని గడ్డివాములను బర్లని ఖాళీ చేస్తే మేము శుభ్రం చేసుకుని ఉంటామని కాళ్లు పట్టుకొని వేడుకున్న కూడా కనికరించకుండా రాత్రిపూట తాగి వచ్చి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఇల్లులు ఆక్రమించుకున్న వారు ప్రస్తుతం మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ గా ఉద్యోగం చేస్తున్న బెల్లి యాదగిరి 2 షీలా ఆగయ్య 4 కన్నబోయిన లింగయ్య 1 కన్నెబోయిన కోటయ్య 2 ఎరుపుల లింగస్వామి 1 మెరుగు వెంకన్న 4 వజ్జే లింగయ్య 4 మెరుగు కనకయ్య 6 మెరుగు గణేష్ రఘు 2 వజ్జే శంకరమ్మ ఇలా అందరూ ఆక్రమించుకొని పేద ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎవరైతే నిరుపేదలు నివసిస్తున్నారు వాళ్లకు కచ్చితంగా ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు చావనైనా చస్తాం గానీ ఇకనుంచి వెళ్లేదే లేదు అని నెల రోజులుగా అక్కడే పిల్లర్ల కింద చెట్ల కింద వంట వార్పు చేసుకుని ఉంటూన్నారు

 పలువురు మహిళలు మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేస్తూ మాకు చావే గతి ఇక మేము ఎక్కడికి వెళ్లాలి ఇండ్లు లేక ఖాళీ స్థలము లేక దాదాపు సంవత్సరాలకొద్దీ కిరాయి ఇండ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్న ఇక్కడ ఉన్నటువంటి నిరుపయాకంగా ఉన్న ఇండ్లను తమకు కేటాయించాలని లేనియెడల భారీ ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మి ,జ్యోతి ,రేణుక ,ఉమా ,అడ్డబొట్టు చారి, పూర్ణ ,అనిల్ తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి