**అధ్యక్షుడు ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో""ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్లో నూతన కమిటీ ఏర్పాటు*

Mar 28, 2026 - 21:34
 0  0
**అధ్యక్షుడు ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో""ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్లో నూతన కమిటీ ఏర్పాటు*

అధ్యక్షుడు ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్‌లో నూతన కమిటీ ఏర్పాటు.

ప్రెస్ క్లబ్ సభ్యుల భాగస్వామ్యంతో అభివృద్ధి దిశగా చర్యలు.

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ::ఖమ్మం మార్చి 28 

ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్‌కు ఎన్నికైన సభ్యులకు అధ్యక్షుడు ఐ ప్రభాకర్ అభినందనలు తెలిపారు. సంస్థను మరింత బలోపేతం చేయడానికి సభ్యుల సమిష్టి కృషి అవసరమని వారు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, సభ్యత్వం పొందిన వారికి కమిటీలో ప్రాధాన్యత కల్పిస్తూ బాధ్యతలు కేటాయించనున్నట్లు వారు తెలిపారు. ప్రతి సభ్యుడు తన బాధ్యతను సమర్థంగా నిర్వహించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని సూచించారు.ప్రెస్ క్లబ్ కార్యకలాపాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం, సభ్యుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఐ ప్రభాకర్ తెలిపారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State