సదరం రెన్యువల్ స్లాట్ బుకింగ్ నిరంతరంగా కొనసాగించాల?
ఉపాధి హామీ పథకంలో వికలాంగులను ప్రత్యేక గ్రూపులుగా విభజించి పని కల్పించాలి?
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సురుభంగ ప్రకాష్ వనం ఉపేందర్ డిమాండ్ అసిస్టెంట్ డి నాగరాజు ఆర్ డి ఓ శ్రీనివాస్ కి వినతి పత్రం అందించడం జరిగింది.
భువనగిరి 22 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా వివిధ మండలాల గ్రామాలలో వికలాంగులకు సదరం సర్టిఫికెట్ రెన్యువల్ కోసం వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అసిస్టెంట్ డిఆర్డిఓ శ్రీనివాస్ కి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వరూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ జిల్లాలోని వికలాంగులు సదరం సర్టిఫికెట్ రెన్యువల్ కోసం ప్రతినెల మీసేవ కేంద్రాల పడిగాపులు కాసినప్పటికీ స్లాట్ బుక్ గాక వెళ్లే పరిస్థితి ఉందని ఒక్కొక్క వికలాంగుడు గత ఆరు ఏడు నెలల నుంచి మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సమస్యను పరిష్కరించడం కోసం రెన్యువల్ స్లాట్ బుకింగ్ ప్రక్రియను నిరంతరంగా కొనసాగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులలో వికలాంగులకు ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి తేలికపాటి పనులను కల్పించాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత తదితరులు పాల్గొనడం జరిగింది.