పోరు దీక్ష పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా పార్టీ నాయకులు

Mar 25, 2026 - 17:52
Mar 25, 2026 - 18:06
 0  1

నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకై "పోరు దీక్ష పోస్టర్" ను

ఆవిష్కరించిన జిల్లా పార్టీ నాయకులు:-

పోరు దీక్షను విజయవంతం చేద్దాం

 జోగులాంబ గద్వాల 25 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈ నెల మార్చి 30న (సోమవారం)  నాడు గద్వాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వైయస్సార్ చౌక్ నందు BRSV ఆధ్వర్యంలో జరిగే నిరుద్యోగుల, విద్యార్థుల పోరు దీక్ష జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం పాతబస్టాండ్ వైఎస్ఆర్ చౌక్ నందు నిర్వహించే కార్యక్రమంనకు సంబంధించి బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోరు దీక్ష పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంనకు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆవిష్కరించిన గద్వాల నియోజకవర్గ బాధ్యులు బాసు హనుమంతు నాయుడు పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకటరాములు, మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, దరూర్ మాజీ జెడ్పిటిసి పద్మ, వెంకటేశ్వర్ రెడ్డి, కెటి దొడ్డి మాజీ ఎంపీపీ చక్రధర్ రెడ్డి, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..

* ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10000 వేల కోట్లు ఉంటే బడ్జెట్ లో 4 వేల కోట్లే కేటాయింపులు చేసి విద్యార్థులను, కళాశాల యాజమాన్యాలను మోసం చేస్తున్న ప్రభుత్వం.

* సంవత్సరంలోపు రెండు లక్షల  ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మోసం..

* ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా మోసం..

* జాబ్ క్యాలెండర్ మోసం..

* విద్యా రంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తాం అని మోసం..

* ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యాభరోసా కార్డు అమలు కాలేదు.

* గురుకులాలలో మౌలిక సదుపాయాలు కల్పించకుండగా, కలుషిత ఆహారం తినడం వలన రాష్ట్రంలో ఇప్పటికి 126 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది ఈ మరణాలకు బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్ దే.

* ఎస్సి, ఎస్టి విద్యార్థులు 10 వ తరగతి పాస్ అయితే 10000, ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు, డిగ్రీ పాసైతే 25000, పిజి పాస్ అయితే లక్ష, పిహెచ్డి పాస్ అయితే ఐదు లక్షలు ఇస్తా మోసం.

* 6 గ్యారంటీ లకు పంగనామాలు పెట్టిన నయవంచన 420 రేవంత్ రెడ్డి సర్కార్.

* ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు BRSV ఉద్యమం ఆగదు అని విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటాం అని హెచ్చరిస్తూ డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు చిత్తారి కిరణ్, సంటెన్న, కమ్మరి రాము, చిన్న రాముడు, మోహన్ మరియు మైనారిటీ సీనియర్ నాయకులు అతికుర్ రెహమాన్, పార్టీ నాయకులు గంజిపేట రాజు, గాజుల కృష్ణ రెడ్డి, మద్దెలబండ శేఖర్, తిమ్మప్ప గౌడు, శ్రీరాములు, ఎస్ రాము, వెంకటేష్ నాయుడు, రాజు నాయుడు, ఎల్కూర్ రమేష్, జమ్మిచేడు రాముడు, మద్దిలేటి, వెంకంపేట రాముడు, ప్రహ్లాదు, జి స్వామి, వీరేష్ మరియు బీఆర్ఎస్వి నాయకులు మహేష్, బండారి అభిషేక్, నరసింహ, రమేష్, నరేష్ తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State