ఇసుక డంపు ఎవరిదో..
కర్ణాటక సరిహద్దులోని చమన్ ఖాన్ దొడ్డి శివారులో అధికారులు గుర్తించిన ఇసుక డంపు
జోగులాంబ గద్వాల 28 మార్చ్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గట్టు. మండలంలోని చమన్ ఖాన్ దొడ్డి శివారులోని సర్వే నంబర్ 94లో అక్రమంగా డంపు చేసిన 10 టిప్పర్ల ఇసుకను గురువారం అధికారులు సీజ్ చేసినా.. దళారులు ఎవరనేది శుక్రవారం నాటికి కూడా తేల్చలేకపోయారు. కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ తెలంగాణ సరిహద్దులోని గట్టు మండలంలో అక్రమ ఇసుక డంపు సమాచారాన్ని స్థానిక తహ సీల్దార్ విజయ్ కుమార్ చేరవేసి, ఆఘమేఘాల మీద సీజ్ చేయించారు. ఆ పొలం యజమాని కర్ణా టకలో ఉంటున్నట్లు తెలిసింది. అయితే ఇసుక అక్రమ నిల్వ విషయం సదరు రైతుకు తెలుసో.. లేదో తెలియాల్సి ఉంది.
కేటీదొడ్డి: అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కర్ణాకర్ అన్నారు. మండలంలోని అక్రమ ఇసుక రవాణాపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి టిప్ప ర్లోని ఇసుకను రోడ్డుపైనే పారబోసి పరారైనా ఘటన మండలంలోని చోటు చేసుకుంది. మైలగడ్డ కాలువ సమీపంలో గల కాలువ రోడ్డుపై టిప్పర్ లోని ఇసుకను డంప్ చేసి అక్కడ నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రోడ్డుపై పారవేసిన ఇసుకను సీజ్ చేసి బాధ్యులను గుర్తించి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు.
విచారణ చేస్తున్నాం..
చమనాఖాన్ దొడ్డి శివారులో అక్రమ ఇసుక డం పును సీజ్ చేసి, విచారణ చేస్తున్నాం. అనుమ తులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. నింది తులను పట్టుకొని కేసు నమోదు చేస్తాం. శేఖర్ గౌడ్, ఎస్ఐ, గట్టు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది