ఉదయాన్నే వాహనాదారులపై ఉక్కు పాదం మోపిన సీఐ నాగేశ్వరరావు

Mar 22, 2026 - 10:16
 0  290
ఉదయాన్నే వాహనాదారులపై ఉక్కు పాదం మోపిన సీఐ నాగేశ్వరరావు

  తిరుమలగిరిలో ఇబ్బంది పడుతున్న ప్రజలు

భారీ వాహనాలు సైతం ఈ మార్గం గుండా ప్రయాణం

తరుచూ ప్రమాదాలు.. ట్రాఫిక్‌ జామ్‌

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

 ఎవరిని వదిలే ప్రసక్తే లేదు

తిరుమలగిరి 22 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్: 

మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పట్టణాలకు వెళ్లేందుకు ఈ మార్గం ముఖ్య కూడలి కావడంతో ఇక్కడి నుంచి నిత్యం వందల వాహనాలు వెళ్తుంటాయి. హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, సూర్యాపేట, జనగాం, భువనగిరి ప్రాంతాలకు ప్రజలు ప్రయాణం సాగిస్తుంటారు. ఈ్ర కమంలో వాహనదారులు రోడ్లపైనే వాహనాలను పార్కింగ్‌ చేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నది. దీంతో తరుచూ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి దీంతో నేడు ఆదివారం ఉదయం పూటనే ట్రాఫిక్ పై షాపుల ముందు ట్రాఫిక్ విరుద్ధంగా పార్కింగ్ లపై ఉక్కు పాదం మోపిన నాగారం సిఐ నాగేశ్వరరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుమలగిరి చౌరస్తాలో నిత్యం రద్దీ ఉండే ప్రాంతంలో వాహనదారులు ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నారని ఎన్నిసార్లు చలాన్లు విధించిన మార్పు రావడంలేదని ఇప్పటినుండి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు వారి వెంట కానిస్టేబుల్స్ హరిబాబు మట్టయ్య శివారెడ్డి పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి