అంగరంగ వైభవంగా సీతారాముడు కళ్యాణం
అంగరంగ వైభవంగా సీతారాముడు కళ్యాణం
రొయ్యూరులో ఆధ్యాత్మిక శోభ: శ్రీరామచంద్రుని పాద చెంత కాకులమర్రి లక్ష్మణ్ బాబు
ఏటూరునాగారం తెలంగాణ వార్త మార్చి 27 : ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరు గ్రామం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. లోక కల్యాణార్థం నిర్వహించిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలో ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కాకులమర్రి లక్ష్మణ్ బాబు మరియు ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి కాకులమర్రి శ్రీలత దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ అభివృద్ధికి భక్తితో పాటు సేవా దృక్పథాన్ని చాటుకుంటూ, రొయ్యూరు దేవస్థానంలోని "ముత్యాల మండప" నిర్మాణ పనుల నిమిత్తం లక్ష్మణ్ బాబు ఇరవై ఐదు వేల రూపాయలు నగదును ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు.భక్తి శ్రద్ధలతో దర్శనంకళ్యాణ మహోత్సవ వేడుకను వీక్షించిన అనంతరం, కాకులమర్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "సీతారాముల ఆశీస్సులతో మన ఏటూరునాగారం మరియు ములుగు జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంచుతాయని" పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ పిఎ సిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్ , స్థానిక సర్పంచ్ కవిరి అర్జున్, గుడి చైర్మన్ అల్లంల రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు దుర్గం లక్ష్మణ్, వార్డ్ సభ్యులు కొండగుర్ల తిరుపతి, కురుమ శ్రీనివాస్, తదితరులు పాల్గొనడం జరిగింది