మద్యం మత్తులో వాహనాలు తోలడం ప్రమాదం.

తేది: 29/7/2025.
పత్రిక ప్రకటన, సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం.
- వారం రోజుల్లో 350 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు.
- పట్టుబడ్డ వారిలో 8 మందికి ఒక్కరోజు జైలు. ఇతరులకు జరిమానా.
.. కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా..
మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు, ఇతరులను ప్రమాదంలో పడేస్తున్నారు అని, ప్రమాదాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా విసృతంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నాం అని ఎస్పి నరసింహ ఐపిఎస్ తెలిపినారు. గత వారం రోజులుగా 350 మంది పై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశాను అన్నారు, జరిమానా మార్పు కోసమే అన్నారు. ఎవ్వరూ కూడా మద్యం మత్తులో వాహనాలు తోలవద్దు అని ఎస్పి కోరారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పలుమార్లు పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు అని ఎస్పి గారు హెచ్చరించారు. రోడ్లపై ప్రయాణ సమయంలో ముందు జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించవచ్చు అని తెలిపినారు.