ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వన మహోత్సవం వేడుకలు

Jul 29, 2025 - 21:08
 0  5
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వన మహోత్సవం వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.  వన మహోత్సవం భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మండలం వైద్యాధికారి మౌనిక మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇళ్ళల్లో  కానీసం ఐదు మొక్కలు నాటి  అన్నారు. అహ్లాదకర వాతావరణం ఉన్నప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పూల చెట్లతో పాటు నీడనిచ్చే చెట్లను పండ్ల చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు వీరేంద్రనాథ్ శైలజ సిహెచ్ఓ యాదగిరి సూపర్వైజర్లు సైదులు, మాణిక్యమ్మ, కొండ్ల శ్రీను, రాజేంద్రప్రసాద్, ఏఎన్ఎంలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.