ఉద్యోగులు నిబద్ధతతో చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: అదనపు కలెక్టర్

జోగులంబ గద్వాల 1 ఏప్రిల్2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఉద్యోగులు నిబద్ధతతో ప్రజలకు అందించే సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అదనపు కలెక్టరు (స్థానిక సంస్థలు) అపూర్వ చౌహాన్ అన్నారు.గద్వాల్ పుర కార్యాలయంలో రెవిన్యూ అధికారిగా పనిచేసే పదవి విరమణ పొందిన రాములును సోమవారం ఐ డి ఓ సి లోని తన ఛాంబర్ లో సన్మానించారు. రాములు శేష జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందంగా గడవాలని ఆకాంక్షించారు...