మహిళా డాక్టర్ పై అత్యాచార ఘటన నిందితుడి ని కఠినంగా శిక్షించాలి.
మాజీ జడ్పీ చైర్మన్ సరిత.
జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- కేంద్రములో ప్రభుత్వ ఆస్పత్రి ముందు బుధవారం రోజున డాక్టర్లు,వైద్య సిబ్బంది లకు నిరసనకు మద్దతు. కోల్‌కతలోని ప్రభుత్వ ఆర్జీకర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి లో ఈనెల 9న మహిళా డాక్టర్ పై అత్యాచారం,హత్యకు కారణమైన నిందితుడి కఠినంగా శిక్షించాలని సరిత డిమాండ్ చేశారు. ఆసుపత్రి ఆవరణలో కోల్‌కత మహిళా డాక్టర్ పై జరిగిన ఘటనకు వైద్యులు,వైద్య సిబ్బంది అధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత,కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి డాక్టర్లకు నిరసనకు మద్దతు తెలిపారు,అనంతరం సరిత మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా దవాఖాన్లలో వైద్య సిబ్బందికి, మహిళలకు భద్రత సౌలతులు లేకపోవడం వ్యవస్థ వైఫల్యమేనని,మహిళలకు రక్షణ కల్పించాలని మహిళల పట్ల గౌరవ మర్యాదలు కల్పించే వరకు ఉద్యమాలు జరుగుతుంటాయన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లప్ప,పులిపాటి వెంకటేష్,నరహరి గౌడ్, డిటిడిసి నర్సింహులు, తుమ్మల నర్సింహులు, కొటేష్,అల్వాల రాజశేఖరరెడ్డి,భాస్కర్ యాదవ్,జనార్థన్ రెడ్డి, శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్,రంజిత్ కుమార్,మాజీ సింగిల్ విండో చైర్మన్ సీసాలు వెంకట్ రెడ్డి,గోపాల్ వర్మ,కేడిఆర్ మధు,కుర్వ శ్రీనివాసులు,ఆనంద్ గౌడ్,డాక్టర్లు,వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.