మిషన్ భగీరథ త్రాగునీరుకు అంతరాయం 

Jun 11, 2025 - 20:09
 0  32
మిషన్ భగీరథ త్రాగునీరుకు అంతరాయం 
మిషన్ భగీరథ త్రాగునీరుకు అంతరాయం 

 మేనేజ్మెంట్ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన వాటర్ మెన్ 

జోగులాంబ గద్వాల 11 జూన్ 2020 5 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్ మండల పరిధిలో ఉన్న నీలహల్లి గ్రామంలో మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. నిత్యం ఏదో ఒక సమస్యతో నీటి సరఫరా నిలిచిపోతూనే వస్తుంది. గ్రామానికి సరిపడ  నీరు సరిపోవటం లేదని వాటర్ మెన్ మిషన్ భగీరథ మేనేజ్మెంట్కు తెలిపినప్పటికీ వారు పట్టించుకోవటం లేదని వాటర్ మెన్ ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం గ్రామంలోని ప్రజలు బోరు బావుల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఉన్నత అధికారుల స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333