దృష్టిలోపంతో బాధపడుతున్న ఉపాధ్యాయ సమస్యలపై
వినతి పత్రం అందించిన బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ B రాఘవేందర్ రెడ్డి
హైదరాబాద్ 29 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ B రాఘవేందర్ రెడ్డి నేతృత్వంలో ఆ సంఘ ప్రతినిధులు బుధవారం సెక్రటేరియట్ లో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశంని కలిసి రాష్ట్రంలో దృష్టిలోపంతో బాధపడుతున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారితో చర్చించి
ఆ సమస్యలపైఅందించారు. జూన్ రెండో వారంలో బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్లుగా వస్తున్న వార్త పై బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్పందిస్తూ దృష్టిలోపంతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు లాంగ్ స్టాండింగ్ తో సంబంధం లేకుండా తను కోరుకున్నట్లయితే అదే ప్లేస్ లో కొనసాగించేలా చూడాలని, ఒకవేళ ఉద్యోగి కోరుకున్నట్లయితే సర్విస్ తో సంబంధం లేకుండా బదిలీకి అవకాశం కల్పించాలని అసోసియేషన్ ప్రతినిధులు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. దృష్టిలోపం కలిగిన ఉపాధ్యాయుల కనుపాపను ఐరిష్ కెమెరా స్కాన్ చేయడంలో సమస్యలు తలెత్తుతాయనే FRS అటెండెన్స్ నుండి తాము మినహాయింపు కోరుతున్నట్లు అసోసియేషన్ తరపున వారికి తెలిపారు.
అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు తమ సమస్యలను పరిష్కరిస్తారని పూర్తి ఆత్మవిశ్వాసం తమకు ఉందని తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి R విజయసాగర్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ నల్లగొండ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.