ఇథనాల్ కంపెనీ రద్దు అయ్యేదాకా ఏ పండగా చెయ్యం పెద్ద ధన్వాడ రైతులు

Jun 10, 2025 - 20:20
 0  5

జోగులాంబ గద్వాల 10 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి  : రాజోలి. రైతుల జీవితంలో చాలా ముఖ్యమైన పండగ ఏరువాక పౌర్ణమి  ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు విత్తనాలు వేయడం కోసం పంటపొలాలు సిద్దం చేసుకునే పండగ పెద్ద ధనవాడ గ్రామ ప్రజలు సమిష్టిగా జరపరాదని నిర్ణయించారు మా పిల్లలు, మా గ్రామం వారు జైలులో ఉండగా మేము సంతోషంగా ఏరువాక పౌర్ణమి ఎలా చేసుకుంటాం. అని అన్నారు ప్రతి ఏడాది చాలా ఘనంగా చేసుకునేటోళ్లం, కానీ ఈ ఇథనాల్ కంపెనీ వచ్చి మా బ్రతుకులలో చీకటి నింపుతుంది. అందుకోసం మా గ్రామంలో ముకుమ్మడిగా పండగ చేయరాదని నిర్ణయించుకున్నాం అని రైతులు అన్నారు. కేసులు ఎత్తివేసి, ఇథనాల్ కంపనీ రద్దు అయ్యేదాకా మా గ్రామంలో ఎలాంటి పండుగ చేసుకోకూడదు అని గ్రామ రైతులు అందరూ నిర్ణయించుకున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333