ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి కలెక్టర్

Jun 11, 2025 - 20:14
 0  10
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి కలెక్టర్

జోగులాంబ గద్వాల 11 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల గోదాములో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులు,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలో భాగంగా కలెక్టర్ ఈ తనిఖీ నిర్వహించారు.గద్వాల జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తో పాటు భద్రత నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.స్ట్రాంగ్ రూమ్ భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. 

ఈ కార్యక్రమంలో గద్వాల తహసిల్దార్ మల్లికార్జున్,ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ కరుణాకర్,సురేష్,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333