కన్నుల పండుగ గా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం

Jun 11, 2025 - 20:10
 0  10
కన్నుల పండుగ గా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం
కన్నుల పండుగ గా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం

జోగులాంబ గద్వాల 11 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిశీలా వాసుడు మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఊరేగింపుగా విగ్రహాలను కళ్యాణమండపం లో ఉంచి  కళ్యాణాన్ని వేదమంత్రాలతో అనేకమంది భక్తుల మధ్య నిర్వహించారు. ఈ పౌర్ణమి కి ముగ్గురు భక్తులు గద్వాల అక్కల రమాదేవి కుటుంబ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్ శేషంపల్లి తిమ్మారెడ్డి, తిమ్మాపూర్ వాస్తవ్యులు బలిజ నాగరాజు స్వామివారి కళ్యాణం జరిపించారు. అనంతరం దేవాలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మాజీ కౌన్సిలర్ భీమ్సేన్ రావు, చంద్రశేఖర రావు, రమేష్ ఆచారి,మధుసూదనాచారి రవి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎద్దుల పరుగు నిర్వహించి తోరణం తెంచే కార్యక్రమం నిర్వహించారు. రాత్రి ఉత్సవ విగ్రహాలతో రథోత్సవాన్ని నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333